Wednesday, April 1, 2026
Literature

నన్ను క్షమించండి…

Spread the love

*నన్ను క్షమించండి*
======🎊=======
నన్ను క్షమించండి…
తేనెపూతల మాటలతో
మెప్పించలేక పోయినందుకు..

నన్ను క్షమించండి..
పూటకో మాటలా నైజాన్ని మార్చుకోనందుకు

కటువు మాటతీరుతోనైనా
బ్రతుకు గమనం బోధించాలనుకున్నా..

కష్టాలెన్నో చూసిన అనుభవంతో
పదేపదే జాగ్రత్తలు వల్లెవేశా.

వెలివేత బహుమతి అందుతుందనుకోలేదు.
బంధాలమధ్య బీటలు చేరుతాయనుకోలేదు..

నన్ను నన్నుగా ఒప్పుకోలేని బంధంలో
నిజమైన ప్రేమ.. ఆప్యాయత
నాకు లభిస్తాయని నేనెప్పుడూ అనుకొను..
అందుకే దూరమైనా నేరమేమీ కాదు..

అయినా మనసులో ఒక్క ఆశయితే ఉంది
కాలమే గురువుగా మారుతుందని..
నేటి అపార్థమే రేపు నిలకడగా
ఎన్నో విలువైన అర్ధాలను చెబుతుందని..
నాలోని స్వచ్ఛతను మీ భాషలో
తప్పకుండా బోధపరుస్తుందని..!

అనూశ్రీ గౌరోజు


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *