Friday, April 18Welcome to Vandebhaarath

solar systems | ఇంటిపై సోలార్ పెట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఎంత? ఈఎంఐ సౌకర్యం ఉంటుందా..?

Spread the love

solar systems: తెలంగాణ‌లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ రెడ్కో కృషి చేస్తోంది.   ఇంధ‌న పొదుపు వారోత్సవాల్లో భాగంగా. సోలార్ విద్యుత్ వల్ల క‌లిగే లాభాలు, ప్రభుత్వ స‌బ్సిడీల పై  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తరచూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే.. సోలార్ విద్యుత్ కకోసం గృహాల‌కు అందిస్తున్న స‌బ్సిడీ ఎంత‌? మ‌హిళా సంఘాల‌కు ఏ విధ‌మైన స‌బ్సిడీ అంద‌జేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సోలార్ రూఫ్ టాప్.. నెట్ మీటరింగ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు కోసం రెడ్కో వ్యక్తి గత గృహాలకు 40% సబ్సిడీ అంద‌జేస్తుంది. దీని వల్ల అధిక కరెంటు బిల్లుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే.. సోలార్ పవర్ సిస్టం మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే క‌నీసం 100 చద‌ర‌పు అడుగుల రూఫ్ ఉండాలి.. సోలార్ ఏర్పాటు చేస్తే నిర్వహ‌ణకు ఇబ్బంది అవుతుంద‌నే ప్రచారం ఉంది. కానీ రెడ్‌కో ద్వారా అందించే సోలార్ ప్యానల్స్ కు 25 సంవత్సరాలు, ఇన్వర్టర్ ఇత‌ర పరికరాలku ఐదు సంవ‌త్సరాల గ్యారoటీ ఉంటుంది.

ఒక‌వేళ ఇబ్బందులు త‌లెత్తినప్పుడు రెడ్‌కో సంస్థ ప్రతినిధులు వ‌చ్చి ప‌రిష్కరిస్తారు. పెరుగుతున్న విద్యుత్ చార్జీ ధ‌ర‌ల‌తో ప్రజ‌లు సోలార్ సిస్టమ్ పై దృష్టి సారిస్తున్నారు.

READ MORE  ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం

సోలార్ యూనిట్లు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి..

solar panel installation : భవనాల పై కప్పులు, భవనాలు చుట్టూ నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలో సోలార్ రూఫ్ ఫోటో వోల్టాయిక్ విద్యుత్ ఉపకరణాలు (rooftop solar) ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్య కాంతి ఎక్కువగా పడే చోట వీటిని ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది.  వ్యక్తిగత గృహం, పారిశ్రామిక భవనం, వాణిజ్య భవనాలు.. లేదా ఇతర ఏ రకమైన భవనం ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ ను అదే భవనం లో అవసరాల కోసం వాడుకోవ‌చ్చు.. మన అవసరాలకు పోనూ ఒకవేళ మిగులు విద్యుత్ ఉన్నట్లైతే పవర్  గ్రిడ్‌కు పంపవచ్చు.

ఈ రకమైన ఉపకరణాలు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు గ్రిడ్ కు అనుసంధానించడానికి.. అలాగే నెట్ మీట‌రింగ్‌ సౌకర్యానికి అనుమతినిస్తాయి. గ్రిడ్ ఇంటరాక్టివ్ పై కప్పు లేదా చిన్న సోలార్ పవర్ ప్లాంటులో , సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయిన డీసీ పవర్ కండిషనింగ్ యూనిట్ ద్వారా ఏసీ ఎనర్జీ గా మార్చి గ్రిడ్ కు అనుసంధానిస్తారు. ఉత్పత్తి అయిన విద్యుత్ ను పూర్తిగా ఉపయోగించుకుంటూ అధికంగా ఉన్న విద్యుత్ గ్రిడ్ లభ్యతను బట్టి గ్రిడ్‌కు అనుసంధానించవచ్చు. వాతావరణం మేఘవృత్తం అయినప్పుడు లేదా రాత్రి సమయాలలో సౌరశక్తి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ సరిపోక‌ పోతే ఈ గ్రిడ్ విద్యుత్ వాడుకోవ‌చ్చు. ఈ గ్రిడ్ రూఫ్ టాఫ్ సోలార్ సిస్ట0 నెట్ మీటరింగ్ విధానంలో పనిచేస్తుంది…

READ MORE  AI cameras | రోడ్ల‌పై ఈ త‌ప్పులు చేసి త‌ప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వ‌ర‌కు జ‌రిమానాలు..

solar systems పై రెడ్‌కో స‌బ్సిడీ..

  • 1 కిలోవాట్ విద్యుత్‌కు ప్రాజెక్టు ధ‌ర రూ.83,700 కాగా, రెడ్కో రూ.14,588 స‌బ్సిడీ అందిస్తోంది. అయితే ద‌ర‌ఖాస్తుకు జీఎస్టీతో కలిపి రూ.1180, నెట్ మీట‌రింగ్‌ కోసం రూ.2950 వినియోగ‌దారులు చెల్లించాలి.
  • 2 కిలోవాట్‌కు రూ.1,44,000 ఖర్చు కాగా, దానిపై రూ.29,176 స‌బ్సిడీ ల‌భిస్తుంది. దరఖాస్తు జీఎస్టీ ధ‌ర కిలోవాట్‌ను బ‌ట్టి పెరుగుతుంది. నెట్‌ మీట‌రింగ్ ఛార్జీలు మాత్రం రూ.2,950 మాత్రమే ఉంటాయి.
  • 3 కిలోవాట్‌కు ప్రాజెక్టు ధర రూ.2,06,400 కాగా.. దీనిపై స‌బ్సిడీ రూ.43,764 అంద‌జేస్తున్నారు.

solar panel price  డ్వాక్రా గ్రూపు స‌భ్యురాళ్లకు ఈఎంఐ విధానంలో చెల్లించుకునే వీలు క‌ల్పించారు. కేవ‌లం రూ.20,134 మొదటి సారి చెల్లించి నెల‌వారీ వాయిదాలో మిగిలిన మొత్తాన్ని  చెల్లించుకోవ‌చ్చు. టీఎస్ రెడ్కో ద్వారా డ్వాక్రా గ్రూప్ సభ్యులకు 40% సబ్సిడీపై సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ పవర్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి గల స్వయం సహాయక సభ్యులు టీఎస్ రెడ్ కో  కార్యాలయాన్ని లేదా డీఆర్‌డీఎ అధికారులను గానీ, స్త్రీ నిధి అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు  చేయవచ్చు. మ‌హిళా సంఘాల‌కు 2 కిలోవాట్‌, 3 కిలోవాట్ వ‌ర‌కు సోలార్ విద్యుతు క‌నెక్షన్లు అందిస్తున్నారు.

READ MORE  ఆ ఊరిలో యూట్యూబర్స్ కోసం అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేసిన ప్రభుత్వం... రూ.లక్షల్లో సంపాదిస్తున్నయవత..

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

ఉదాహ‌ర‌ణ‌కు 2 కిలోవాట్ సోలార్ సిస్టం అమ‌ర్చుకునేందుకు రూ.29,176 స‌బ్సిడీ పోగా.. ద‌ర‌ఖాస్తు రుసుము నెట్ మీట‌ర్ ఛార్జీలు అన్నీ కలిపి రూ. 1,20,134 ఖర్చు అవుతుంది. అయితే ఇందులో రూ.ల‌క్ష నిధులను స్త్రీ నిధి లేదా బ్యాంకు ద్వారా లింకేజీ చేస్తారు. స‌భ్యురాలు త‌న వాటాగా కేవ‌లం రూ.20,134 మొదట చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రుసుం మూడు సంవత్సరాల్లో నెల‌కు రూ.2,243 చొప్పున ఈఎంఐ విధానంలో చెల్లించుకోవ‌చ్చు.

ఫ్యాన్లు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు

ఇంధన పొదుపు కోసం మార్కెట్ రేటు కంటే తక్కువకే టీఎస్ రెడ్కో.. నాణ్యమైన, వారంటీతో ఫ్యాన్లు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, ఎల్ఈడీ బల్బులు అందిస్తున్నది.. వీటి ద్వారా తక్కువ విద్యుత్ వినియోగమై అధిక కరెంటు బిల్లుల నుంచి ఉపసమనం పొందవచ్చు.. 28 వాట్ల బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్ మార్కెట్ రేటు రూ.4040 కాగా.. రెడ్కో ఆధ్వర్యంలో..  రూ.2,540 కే అందుబాటులో ఉంది..


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *