Narak Chaturdashi And Significance of Abhyanga Snan | నరక చతుర్దశి అనేది భారతదేశమంతటా దీపావళికి ముందు రోజు జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ . దీనిని ” చోటీ దీపావళి (Choti Diwali) ” అని కూడా అంటారు. నరకాసురుడు అనే రాక్షస రాజును కృష్ణుడు, కాళి, సత్యభామ కలిసి సంహరించిన రోజు రోజు కూడా ఇదే. ఎన్నో పురాతన ఆచారాలు, నమ్మకాలు ఈ ప్రత్యేక రోజుతో ముడిపడి ఉన్నాయి.
నరక చతుర్దశి అంటే ఏమిటి?
శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదే రోజున నరకాసురుడు అనే రాక్షసుడిని ఓడించి, ప్రపంచాన్ని అతడి భయంకరమైన పాలన నుండి విముక్తి కలిగించాడు. ఫలితంగా, ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయంగా చెప్పుకుంటారు. నరక చతుర్దశి నాడు కొన్ని ఆచారాలను పాటించడం వల్ల నరకంలోని బాధలను నివారించవచ్చని భక్తులు నమ్ముతారు.
స్నానం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజువారీ పని. మనమందరం స్నానం చేసిన తర్వాత చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతాం. అయితే, సాధారణ స్నానం కంటే అభ్యంగస్నం ఆధ్యాత్మికమైనది.. శరీరంతోపాటు మనస్సును శుద్ధి చేస్తుంది. అభ్యంగ స్నానం. ఉదయాన్నే లేచి, సూర్యోదయానికి ముందు, మొత్తం శరీరానికి నూనె రాసుకుని, చర్మంలోకి ఇమిడిపోయేవరకు మర్దన చేసి, ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేస్తారు.
నరకచతుర్ధశి నాడు అభ్యంగ స్నానం తప్పనిసరిగా ఆచరిస్తారు. ఇది శరీరంతోపాటు ఆత్మ రెండింటినీ శుద్ధి చేస్తుంది. సూర్యోదయానికి ముందు నువ్వుల నూనెతో స్నానం చేయడం ఆనవాయితీ. చతుర్దశి తిథి ఇంకా బలంగా ఉన్నప్పుడే ఈ స్నానం ఆచరిస్తారు. మన పురాతన గ్రంథాల ప్రకారం, నరక చతుర్దశి నాడు అభ్యంగ స్నానాన్ని ఆచరించే వారు తమ పాపాలను తొలగిపోయి, ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొంది, నరకానికి వెళ్లకుండా రక్షణ కల్పిస్తారు. ఇది శరీరాన్ని ఆత్మను శుభ్రపరుస్తుంది, దుష్ప్రభావాన్ని తొలగించి, రాబోయే లక్ష్మీ పూజ కోసం మనల్ని సిద్ధం చేస్తుంది.
అభ్యంగ్ స్నానం ఎలా చేయాలి.
Abhyang Snan : పసుపు, నువ్వుల నూనె, ఇతర మూలికల మిశ్రమం, స్నానానికి ముందు శరీరానికి పట్టిస్తారు. ఇది చర్మంపై మలినాలను, శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. ముహూర్త సమయం : చతుర్దశి తిథి ఉన్న సమయంలో చంద్రోదయం సూర్యోదయం మధ్య అభ్యంగ స్నానాన్ని నిర్వహిస్తారు. స్నానం తర్వాత, శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. ఎలాంటి కష్టాలు దరిచేరవద్దని కోరుకుంటారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం.. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దుష్టశక్తులను దూరం చేయడానికి ఇళ్ల వెలుపల దీపాలను వెలిగిస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..