SCR Special Trains | పెరుగుతున్న ప్రయాణికల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ – విల్లుపురం (Secunderabad to Villupuram) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. రైలు నెం. 07601 డిసెంబర్ 12, 2024, గురువారం రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. రైలు నెం. 07602 డిసెంబర్ 13, 2024 శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విల్లుపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు సర్వీసులు వన్-టైమ్ స్పెషల్‌లుగా షెడ్యూల్ చేసింది.
కోచ్ కంపోజిషన్
రైళ్లలో రెండు AC టూ-టైర్ కోచ్‌లు, ఏడు AC త్రీ-టైర్ కోచ్‌లు, పదకొండు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు లగేజ్-కమ్-బ్రేక్ వ్యాన్ కోచ్ ఉంటుంది.
దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సమయాలు, స్టాపేజ్‌ల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ప్రయాణం సాఫీగా సాగేందుకు ప్రయాణికులు తమ టిక్కెట్లను వెంటనే బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. బిజీ సీజన్‌లో ప్రయాణీకుల కోసం మెరుగైన ట్రావెల్ ఆప్షన్‌లను అందించడం, మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రత్యేక రైళ్ల (SCR Special Trains )ను ప్రవేశపెడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..