Monday, April 7Welcome to Vandebhaarath

SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!

Spread the love

SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ మిత్ర, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖస్తులు కోరుతూ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతొ ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు వచ్చాయి. పది పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 25 గంటల ట్రైనంగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ వారు ఇంటి నుంచే పని చేసుకునే సౌలభ్యం ఉంది.

ఇంటి నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఐతే ఇన్సూరన్స్ అనగానే టార్గెట్స్ ఉంటాయని అనుకుంటారు కానీ వెస్బీఐ లో ఎలాంటి టార్గెట్స్ ఉండవు. టార్గెట్స్ లేకుండానే మీరు చేసిన పాలసీలతో నెల వారి సంపాదన ఉంటుంది. లైఫ్ మిత్ర పోస్టులు అంటే ఏమిటి..? ఏం చేయాలన్న సందేహం ఉంటుంది. అసలు వారు ఏం చేయాలన్నది కూడా అనుమానం ఉంటుంది. వారికి జీతం ఇస్తారా లేదా కమీషనేనా అన్నది కూడా తెలుసుకోవలంటే కింద చూడండి.

READ MORE  Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి

ఈ లింక్ తో జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

ఇక నోటిఫికేషన్ లోకి చూస్తే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఈ జాబ్ అప్లికేషన్ వచ్చింది. భర్తీ చేసే ఉద్యోగం లైఫ్ మిత్ర లేదా లైఫ్ అడ్వైజర్. దీనికి అర్హతలు కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత మాత్రమే. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం ఏమి ఉండదు. వారు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తే దానిపై కమీషన్ వస్తుంది. ఒక పాలసీ చేస్తే దాని మీద 30 శాతం వరకు కమీషన్ పొందే ఛాన్స్ ఉంది. వినియోగదారులు చెల్లించే ప్రీమియం మెద కొంత కమీషన్ ఉంటుంది. ఇతర రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

READ MORE  Skill University | తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా.. త్వరలో బాధ్యతలు

ఈ జాబ్ చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎంపిక విధానం ఈ పోస్టులకు అప్లై చేసిన వారికి కంపెనీ వారు ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఆన్ లైన్ లోనే ఈ జాబ్ కి అప్లై చేయాలి. అప్లై చేసేప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగా చూసుకోవాలి. ఈ పోస్ట్ ద్వారా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించాల్సి ఉంటుంది. మంచి పనితీరు చూపించిన వారికి ఈ సంస్థలో పర్మినెంట్ ఉద్యోగం కూడా వస్తుంది.

READ MORE  Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ జాబ్ పూర్తిగా వర్క్ ఫ్రం హోం. ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ జాబ్ కి అప్లై చేసుకోండి.

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *