భజరంగీ భాయిజన్ పాప గుర్తుందా? ఇప్పుడెంత అందంగా ఉందో చూడండి..
సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మువీ బజరంగీ భాయిజాన్‌లో నటించిన క్యూట్ బేబీ హర్షాలీ మల్హోత్రా ఇటీవల ముంబైలో మెరిసింది. హర్షాలీ ఖార్‌లోని కథక్ క్లాస్ హాజరై
బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు వీడియోలు తీశారు. మల్హోత్రా రంగురంగుల కుర్తీని ధరించింది. ఆమె మనోహరమైన చిరునవ్వుతో ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోపై పలువురు అభిమానులు స్పందించారు. వారు ఆమె అందమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
హర్షాలీ మల్హోత్రా ప్రొఫెషనల్ ఫ్రంట్
సల్మాన్ అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచిన బజరంగీ భాయిజాన్‌లో హర్షాలీ పాత్ర అత్యంత కీలకమైంది. ఆమె తన నటనతో అందరి హృదయాల్లో చెరగని మృద్ర వేసింది. హర్షాలీ మల్హోత్రా కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన బజరంగీ భాయిజాన్‌లో పాకిస్థానీ ముస్లిం అమ్మాయిగా నటించింది. సల్మాన్ ఖాన్ , కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో కలిసి నటించింది. ఆమె మూగ అమ్మాయిగా తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె 2022లో డాక్టర్ అంబేద్కర్ అవార్డుతో సహా పలు
ప్రతిష్టాత్మక అవార్డులను కూడా గెలుచుకుంది. బజరంగీ భాయిజాన్ సినిమాతో హర్షాలీ మల్హోత్రా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌కు నామినేషన్ సాధించింది. ఆమె కేటగిరీలో నామినేట్ చేయబడిన అతి పిన్న వయస్కురాలు. ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును కూడా గెలుచుకుంది. బజరంగీ భాయిజాన్ తర్వాత, ఆమె ఖుబూల్ హై (2014), లౌత్ ఆవో త్రిష (2014) వంటి కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో పనిచేసింది.
ఇంతకుముందు, పింక్‌విల్లాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, హర్షాలీ 2015 బ్లాక్‌బస్టర్ బజరంగీ భాయిజాన్‌కి సీక్వెల్ కోసం తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. సల్మాన్‌ఖాన్‌లో తన పాత్ర ఉంటుందని ఆశిస్తున్నానని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని చెప్పింది. తాను సల్మాన్ ఖాన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నానని, ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజున అతనికి శుభాకాంక్షలు చెబుతానని నటి వెల్లడించింది. బజరంగీ భాయిజాన్ సెట్‌లో తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, హర్షాలీ ఇలా పంచుకున్నారు, “మేము చిత్రీకరణ సమయంలో చాలా సరదాగా ఉండేవాళ్లం. మేము ATV రైడ్‌లకు వెళ్తాము టేబుల్ టెన్నిస్ కూడా ఆడతాము’’ అని పేర్కొంది.
View this post on Instagram
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి, అలాగే సలహాలు సూచనల కోసం ట్విటర్ లో సంప్రదించండి