Posted in

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Sabarimala Special Trains
Spread the love

Sabarimala Special Trains: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శబరిమలకు అయ్య‌ప్ప భ‌క్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి వరకూ భ‌క్తుల ర‌ద్దీ కొనసాగుతుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రైళ్లు కిట‌కిట‌లాడుతుంటాయి.
టికెట్ రిజర్వేషన్ కూడా ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఈ నేప‌థ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్‌.. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి అందుబాటులో ఓసారి ప‌రిశీలించండి..

శబరిమల అయ్యప్ప భక్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.ఈ 26 రైళ్లు తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేరళ మధ్య రాక‌పోక‌లు సాగించ‌నున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29వ‌ తేదీల్లోనూ తిరిగి డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, జనవరి 1వ‌ తేదీల్లో నడవనున్నాయి.

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

రైలు నెంబర్ 07143 మౌలాలీ నుంచి కొల్లాం ప్రత్యేక రైలు డిసెంబర్ 6,13, 20, 27వ‌ తేదీల్లో న‌డుస్తుంది. తిరిగి ఇదే రైలు కొల్లాం నుంచి మౌలాలీకు నెంబర్ 07144 తో డిసెంబర్ 8, 15,22,29వ‌ తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ తరగతి, జనరల్ భోగీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ నవంబర్ 20 బుధ‌వారం నుంచే ప్రారంభమైంది. శబరిమల సీజన్ కావడంతో టికెట్లు లభించక భక్తులు ఇబ్బందులు ప‌డుతుంటారు. అందుకే భక్తుల ఇబ్బందుల్ని దూరం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

మచిలీపట్నం-కొల్లం మధ్య‌ (07145) ప్రత్యేక రైలు ఈ నెల 25వ తేదీన‌, డిసెంబర్ 2, 9, 16వ‌ తేదీల్లో న‌డుస్తుంది. తిరుగు ప్ర‌యాణంలో కొల్లాం- మచిలీపట్నం రైలు నెం. 07146 నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18వ‌ తేదీల్లో మొత్తం 10 సర్వీసులను షెడ్యూల్ చేశారు. అదే విధంగా మచిలీపట్నం-కొల్లం రైలు 07147 నెంబ‌ర్ తో డిసెంబర్ 23, 30వ‌ తేదీల్లో నడ‌వనుంది. ఇక, కొల్లాం- మచిలీపట్నం రైలు నెం. 07148 డిసెంబర్ 25, జ‌న‌వ‌రి 1వ తేదీన మొత్తం నాలుగు స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డిమాండ్ కు అనుగుణంగా డిసెంబర్ ద్వితీయార్ధంలో మరిన్ని ప్రత్యేక రైళ్ల పైన నిర్ణయం తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *