Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..
Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ (E – Kyc) ప్రక్రియ గడువును ఫిబ్రవరి చివరి వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ – కేవైసీ ప్రక్రియ మమ్మరంగా బాకొనసాగుతుండగా.. జనవరి 31వ తేదీన గడువు ముగియనుంది. ఈ క్రమంలో రేషన్ షాపుల వద్ద జనం బారులు తీరుతున్నారు. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో ఈ – కేవైసీ అప్డేట్ చేస్తున్నా ఇంకా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ – కేవైసీ పూర్తి కాకుంటే రేషన్ సరుకులు కోత పెడతారనే భయాందోళన ప్రజల్లో నెలకొంది. అందుకే జనం హైరానా పడుతూ రేషన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ముందుగా విధించిన గడువు ఇంకా కొద్ది రోజులే ఉండగా.. రేషన్ కార్డుదారులు ఆందోళన చెందారు. దీంతో గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు రేషన్ కార్డుల ఈ -కేవైసీ 75.76 శాతం పూర్తయింది. ఈ ప్రక్రియ అనేక రాష్ట్రాల్లోనూ ఇంకా పూర్తికాలేదు. అందుకే రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానించే ప్రక్రియ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్రం పొడిగించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 100 శాతం ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిని ఆదేశించారు..
ఈ – కేవైసీ ఎందుకంటే.?
Rationcard ekyc process : రేషన్ షాపుల్లో గత రెండు నెలలుగా డీలర్లు ఈ – కేవైసీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ స్కీమ్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ రేషన్ సరుకులను ఉచితంగా అందిస్తోంది. అయితే, బోగస్ కార్డుల తొలగింపునకు రేషన్ కార్డును ఆధార్ నెంబర్ కు లింక్ చేయడం కీలకంగా మారింది. కాగా చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండిపోయాయి. దీంతో సరకులు పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమా లకు చెక్ పెట్టేందుకు ఈ – కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు. కుటుంబంలో ఎంత మంది లబ్ధిదారులు ఉంటే వారందరూ కూడా ఈ – కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
కొత్త రేషన్ కార్డులు
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ – కేవైసీ ప్రక్రియ పూర్తయితేనే కొత్త లబ్ధిదారుల విషయంలో స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. 100 శాతం లక్ష్యం పూర్తయితేనే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతం కానుంది. దీన్ని బట్టి మార్చి తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ షురూ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..