Raksha Bandhan 2023 : రాఖీ పండుగ తేదీ, శుభ ముహూర్తం, చరిత్ర, ప్రాముఖ్యత
Rakhi Festival : రక్షా బంధన్, లేదా రాఖీ పర్వదినం తోబుట్టువుల మధ్య అనుబంధాలకు ప్రతీక. ఈ పండుగ ఏటా శ్రావణ మాసంలో పూర్ణిమ తిథి (పౌర్ణమి రోజు) రోజున వస్తుంది. ఈ పర్వదినాన సోదరులు, సోదరీమణులు ప్రత్యేక పూజలు చేసి సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీ కట్టి, వారి నుదుటిపై తిలకం వేసి, వారి శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులకు అన్ని కాలాల్లో రక్షణగా నిలుస్తారని భావిస్తారు. వారికి కానుకలను అందజేస్తారు. అయితే ఇటీవల కాలంలో సోదరీమణులు కూడా ఒకరికొకరు మణికట్టుకు రాఖీ కట్టి పండుగను జరుపుకుంటారు.
రక్షాబంధన్ పండుగ ఏ రోజు.. ఆగస్టు 30 లేదా 31?
What Is Rakhi Festival: దేశ ప్రజలు రాఖీ పర్వదినాన్ని జరుపునే సమయం ఆసన్నమైంది. అయితే ఈ సంవత్సరం రాఖీ రోజున తోబుట్టువులంతా వారి అన్నాదముళ్లకు ఎలాంటి రాఖీలు కట్టాలనే విషయమై పలు రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. కానీ ఈసారి రక్షబంధన్ విషయంలో ఓ చిక్కు వచ్చింది. పండుగను ఏ రోజున జరుపుకోవాలి..? ఆగస్టు 30వ తేదీనా..? లేక 31 తేదీనా..? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఈసారి రక్షాబంధన్ పండుగ ఆగస్టు 30వ తేదీన(బుధవారం) ప్రారంభమవుతుంది. కానీ అదేరోజు భద్ర కాలం ఉంది. ఆరోజు భద్రకాలం రాత్రి 9.01గంటలకు ముగియనుంది. దీన్ని బట్టి ఆగస్టు 31న(గురువారం పర్వదినాన్ని జరుపుకోవడం ఆమోదయోగ్యమైనదని వేదపండితులు చెబుతున్నారు.
భద్ర కాలంలో రాఖీ వద్దు..
భద్ర కాలం ఆగస్టు 30న బుధవారం ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 9.01 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయొద్దు. రాఖీలు కూడా కట్టవద్దు. సోదరీమణులు భద్ర ముహూర్తంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాఖీ కట్టొద్దు. ఎందుకంటే భద్ర కాలంలో రాఖీ కట్టడం అశుభమని భావిస్తారు. లంకాధిపతి రావణుడి సోదరి అయిన భద్ర ఇలాంటి ముహూర్తంలోనే రాఖీ కట్టడం వల్ల శ్రీరాముడి చేతిలో చనిపోయాడు.
రక్షా బంధన్ చరిత్ర, ప్రాముఖ్యత
హిందువులు రక్షా బంధన్ పండుగకు ఎంతో ప్రాధాన్యాన్నిస్తారు. ఈ పండుగకు సంబంధించిన పురాణాలలో ఒకటి మహాభారత ఇతిహాసం నుంచి ఉద్భవించింది. పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుడు అనుకోకుండా సుదర్శన చక్రంతో తన వేలును కోసుకున్నాడు. అది చూసిన ద్రౌపది తన చీరను నుంచి గుడ్డను చించి రక్తస్రావం ఆపడానికి గాను వేలికి కట్టు కట్టింది. దీంతోవ వెంటనే శ్రీకృష్ణుడు, ఆమె ఆప్యాయంగా హత్తుకొని, ఆమెను అన్ని కాలాల్లో ఒక సోదరుడిగా రక్షిస్తానని వాగ్దానం చేశాడు. జూదంలో పాండవులు ఓడిన తర్వాత కౌరవులు ఆమెను అవమానపరచడానికి ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణుడు.. ద్రౌపదికి చీరను అందించి వాగ్దానాన్ని నెరవేర్చాడు.
రక్షా బంధన్ వేడుకలు
దేశవ్యాప్తంగా రక్షా బంధన్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరులకు హారతి ఇచ్చి వారి నుదుటిపై తిలకం దిద్దడం, వారి మణికట్టుకు రాఖీ కట్టడం, మిఠాయిలను అందించడం మరియు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి చేస్తారు. బదులుగా, సోదరులు తమ సోదరీమణులను రక్షిస్తారని వాగ్దానం చేస్తారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.