
Rajnath Singh | బిజెపికి వాషింగ్ మెషీన్ ఉందని, ఇతర పార్టీల నాయకులు అధికార పార్టీలో చేరిన తర్వాత వారిని “క్లీన్”గా మారుస్తారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. బిజెపిలో వాషింగ్ మెషీన్ లేదని, ఎవరినీ కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం ఏజెన్సీలకు చెప్పడం లేదని ఆయన అన్నారు. “వాషింగ్ మెషీన్ అంటూ ఏదీ లేదు, ఏజెన్సీలు తమ పనిని చేయాలి. ఇప్పుడు అదే చేస్తోంది. ఇతర పార్టీలను అరెస్టు చేయాలని మేము ఏజెన్సీలకు చెబుతున్నామంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.. వారు తమ తప్పులను, అవినీతిని, బలహీనతలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా అవినీతి ఆరోపణల నుండి తప్పించుకోవచ్చని వారు భావిస్తే, వారు పొరబడినట్లేనని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేసిందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్‌కు కోర్టులు ఎందుకు రిలీఫ్ ఇవ్వలేదని ఆశ్చర్యపోయారు. ‘‘మా వల్లే అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని భావించినా.. ఆయనకు ఎందుకు ఉపశమనం లభించడం లేదు?.. అని ప్రశ్నించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ తమ పని తాము చేసుకుపోతున్నాయని సింగ్ అన్నారు. నిరాధార ఆరోపణలతో తమ నేతలను జైలుకు పంపిస్తున్నారని ప్రతిపక్షాలు భావిస్తే కోర్టుల నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. ఆప్ నేత సంజయ్ సింగ్‌కు బెయిల్ లభిస్తే ఇతర నేతలు కోర్టుల నుంచి ఎందుకు ఉపశమనం పొందలేకపోయారని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు.
కాగా మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసింది. ఈడి చర్యను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు ఇటీవల నిరాకరించింది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే..
Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..