Pakistan | భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన పిల్లలు మురికి కాలువల్లో పడి చస్తున్నరు.. పాక్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pakistan | భారత్ ఒకవైపు అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంటే పాక్ లో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయని పాకిస్థాన్ ఎంపీ సయ్యద్ ముస్తాఫా కమల్ వెల్లడించారు. పాకిస్థాన్ లోని రాజకీయ పార్టీ ముత్తాహి దా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ (Syed Mustafa Kamal) పాక్ పార్లమెంట్‌లో బుధవారం దేశ సమస్యలను ప్రస్తావించారు. ‘ప్రపంచం ఓవైపు చంద్రుడిపైకి వెళ్తుండగా మన కరాచీ పరిస్థితి చూస్తే చాలా మంది చిన్నారులు మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇక్కడ కరాచీలో ఒక చిన్నారి కాలువలో పడి మరణించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీ మూడు రోజలకు ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి అంటూ పాక్‌లోని పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఆయన కరాచీలోని తాగునీటి ఎద్దడి సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. ‘కరాచీ పాకిస్థాన్‌కు ప్రధాన ఆదాయ వనరు.. దేశంలో రెండు ప్రధానమైన వోడరేవులు కరాచీలోనే ఉన్నాయి. ఈ కారణంగా కరాచి నగరం దేశానికి గేట్‌వే లాంటిది. కరాచీకి 15 ఏళ్లుగా పరిశుభ్రమైన తాగునీరు లభించడం లేదు. తాగునీళ్ల ట్యాంకు సైతం చోరీలకు గురవుతున్నాయి. నీటి మాఫియా ట్యాంకుల నీటిని కరాచీ ప్రజలకు అమ్మకుంటోందని అన్నారు.
“మన పొరుగున ఉన్న భారతదేశం – 30 సంవత్సరాల క్రితం, అది ప్రపంచానికి అవసరమైన వాటిని తన పౌరులకు నేర్పింది. నేడు, భారతీయులు 25 అగ్ర గ్లోబల్ కంపెనీలకు CEOలుగా ఉన్నారు. నేడు, భారతదేశంలో ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ” అని కమల్ చెప్పారు. పాకిస్తాన్‌లోని విశ్వవిద్యాలయాలు “ఉద్యోగం లేని” యువతను ఉత్పత్తి చేసే “పరిశ్రమలు” అని ఆయన అన్నారు. “ప్రపంచంలో డిమాండ్ ఉన్న అంశాలను వారికి బోధించకపోవడమే దీనికి కారణం” అని MQM-P నాయకుడు చెప్పారు.
మరోవైపు Pakistan కరాచీ సింధ్ ప్రావిన్స్ లో 48వేల పాఠశాలలున్నాయని.. అయితే పిల్లలు బడిమానేస్తుండడంత అందులో 11వేల పాఠశాలలు ఖాళీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని తెలుపుతుందని.. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు బడికి వెళ్లడం లేదని చెప్పారు. నిరక్షరాస్యత వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పాక్ నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్, పాకిస్థాన్ లకు ఒకేసారి స్వాతంత్య్రం వచ్చిందని, కానీ నేడు భారత్ అగ్రరాజ్యంగా ఎదిగుతోందని, కానీ తాము ఇంకా కలలు కంటూనే ఉన్నామన్నారు. ఈ క్రమంలోనే ముస్తాఫా కమల్ వ్యాఖ్యలు ఆ దేశ దుస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..