Saturday, August 30Thank you for visiting

Operation Sindoor LIVE : పాక్ లోని మూడు వైమానిక స్థావరాలపై భారత్ భీకర దాడులు..

Spread the love

Operation Sindoor LIVE : భారత్, పాక్ సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్‌ దాడి చేయడంతో.. భారత్ దీటుగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై ఒక్కసారిగా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి సైతం ధ్రువీకరించారు.

పాక్‌ సైన్యం (Pakistan Air Force) హెడ్‌క్వార్టర్‌ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్‌, చక్వాల్‌లోని మురీద్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ సైన్యం ప్రకటించుకుంది.

ఇక భారత్‌పై దాడులకు దాయాది దేశం ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ (బలమైన పునాది) అనే పేరుపెట్టింది. కాగా ఈ దాడులపై భారత వాయుసేన, సైన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.నేటి ఉదయం 10 గంటలకు భారత ఆర్మీ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.

రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్నా కాస్త చీకటి కాగానే మరోసారి మదేశంపై పాక్ మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. బారాముల్లా నుంచి భుజ్‌ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్ల(Drones)తో దాడికి దిగింది. ఇందులో శ్రీనగర్‌ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను మన భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొట్టింది. శనివారం తెల్లవారు జాము నుంచి పాక్‌ తిరిగి దాడులు కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *