One Nation, One Election bill | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సర్వన్నద్ధమైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ఆలోచనను “చారిత్రకమైనది” అని పేర్కొంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానం ద్వారా ఎన్నికల ఖర్చు భారీగా తగ్గుతుందని, స్థిరమైన పాలనకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్రస్తావించారు.
నివేదికల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్రకారం.. ప్రస్తుతం జమిలి ఎన్నికలు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు ఉన్నప్పటికీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలను “ప్రస్తుతానికి” మినహాయించారు. దశలవారీగా వాటిని చేర్చనున్నట్లు సమాచారం.
తృణమూల్ కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు, ప్రతిపాదిత జమిలీ ఎన్నికలపై పదేపదే ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది దేశ సమాఖ్య నిర్మాణానికి విఘాతం కలిగిస్తుందని, ప్రాంతీయ పార్టీలను బలహీనపరుస్తుందని ఆరోపించాయి.
పాలనను క్రమబద్ధీకరించడానికి ఎన్నికల-సంబంధిత ఖర్చులను తగ్గించడానికి ఈ ఆలోచనను బిజెపి సమర్థించింది, అయితే భారతదేశం వంటి విభిన్నమైన విస్తారమైన భూభాగంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలు చిక్కులు, ఎదురవుతాయని పలు పార్టీలు పేర్కొన్నాయి.
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే భావన కొత్తదా?
‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ (One Nation, One Election bill) అనేది భారతదేశంలో కొత్త కాన్సెప్ట్ కాదని గమనించాలి. 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత, 1951 నుంచి 1967 మధ్యకాలంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 1952, 1957, 1962 మరియు 1967లో కేంద్రం, రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పడటం, కొన్ని పాత రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించబడిన కారణంగా జమిలీ ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగింది. . 1968-1969లో వివిధ శాసన సభల రద్దు తర్వాత, ఈ పద్ధతి పూర్తిగా రద్దయింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..