Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్ పాలసీ
Nitin Gadkari – Humsafar Policy | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్‌వర్క్‌లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ‘హమ్‌సఫర్ పాలసీ (Humsafar Policy )’ని ప్రారంభించారు. ఈ పాలసీ కింద రహదారుల వెంట బేబీ కేర్ రూమ్స్, క్లీన్ టాయిలెట్స్, వీల్‌చైర్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్, పార్కింగ్ ప్రాంతాలు, ఫ్యూయల్ స్టేషన్లలో హాస్టల్ తదితర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విధానంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అనుకూలమైన, సురక్షితమైన, ఉత్సాహభరితమైన ప్రయాణ అనుభూతిని అందించనుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఈ పాలసీ దోహదపడుతుందని తెలిపారు.
- ఈ విధానం సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో పర్యావరణ అనుకూల సౌకర్యాలను ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ పథకం వినియోగదారులకు సులభతరమైన, సురక్షితమైన ఆహ్లాదకరమైన ప్రయాణాలను అందిస్తుందని గడ్కరీ చెప్పారు.
- హమ్‌సఫర్ విధానంలో జాతీయ రహదారుల్లో ఫుడ్ కోర్టులు, ఫలహారశాలలు, ఫ్యూయల్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ సౌకర్యాలు, టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్‌లు, ఏటీఎంలు, వాహనాల రిపేరింగ్ షాపులు , ఫార్మసీ సేవలు వంటి సౌకర్యాలు ఉంటాయని మంత్రి తెలిపారు.
- నీటి సంరక్షణ, నేల సంరక్షణ, వ్యర్థాల రీసైక్లింగ్, సోలార్‌తో సహా అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు.
- పాలసీలో భాగంగా, ప్రయాణికులు తమ స్థానానికి సమీపంలోని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ల వివరాలను మొబైల్ యాప్ ‘రాజ్‌మార్గ్ యాత్ర’లో తక్షణమే గుర్తించవచ్చు. ఇది సమస్యలను రిపోర్ట్ చేయడానికి అలాగే సేవలు, సౌకర్యాలపై ర్యాంకింగ్ చేయడానికి ప్రయాణికులకు వీలు కల్పిస్తుంది.
- గడ్కరీ మార్గదర్శకత్వంలో ఇప్పటికే 1.5 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశామని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా తెలిపారు. ప్రధానమంత్రి దార్శనికత, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి మార్గదర్శకత్వం దేశంలో మౌలిక సదుపాయాలను సమూలంగా అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని టామ్టా అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..