ఘోర ప్రమాదం : లడఖ్‌లో వాహనం లోయలో పడి 9 మంది ఆర్మీ సిబ్బంది మృతి
1 min read

ఘోర ప్రమాదం : లడఖ్‌లో వాహనం లోయలో పడి 9 మంది ఆర్మీ సిబ్బంది మృతి

Spread the love

లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లడఖ్‌లోని లేహ్ జిల్లాలో  ట్రక్కు రోడ్డుపై నుండి జారి పడి లోతైన లోయలో పడటంతో తొమ్మిది మంది సైనికులు మరణించారు.. ఈప్రమాదంలో  మరో అధికారి గాయపడినట్లు వార్త సంస్థ ANI నివేదించింది.

మృతుల్లో ఎనిమిది మంది సైనికులు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) ఉన్నారు. ట్రక్కు కరూ గ్యారీసన్ నుండి లెహ్ సమీపంలోని క్యారీకి వెళుతుండగా క్యారీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయలో పడిపోయింది. ఇది మొత్తం 34 మంది సిబ్బందితో ఒక SUV,  అంబులెన్స్‌తో సహా దళంలో భాగం. మూడు వాహనాలు రెక్సే పార్టీ (recce party) నిర్వహణ లో ఉన్నాయి.

దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని కెరీ వద్ద శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

రాజ్ నాథ్ సింగ్ సంతాపం

సైనికుల మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. “లడఖ్‌లోని లేహ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బందిని కోల్పోయినందుకు బాధగా ఉంది. మన దేశానికి వారి ఆదర్శప్రాయమైన సేవను మేము ఎప్పటికీ మరచిపోలేము.  మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. గాయపడిన సిబ్బందిని ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు.  వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని మంత్రి  ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *