Saturday, April 19Welcome to Vandebhaarath

కీర్తినగర్ లో వైభవంగా ముగిసిన శాకంబరి ఉత్సవాలు

Spread the love

కోలాహలంగా అమ్మవారి రథయాత్ర

కీర్తినగర్ కాలనీ: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువుదీరిన శ్రీ నిమిషాంబ దేవి అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు సోమ వారం ఘనంగా ముగిశా యి. శాకంబరీ మహోత్సవాల్లో భాగంగా వేద పండితులు కల్యాణ్ ఆచార్యులు ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ప్రతీ రోజు అమ్మవా రికి ప్ర త్యేక పూజలు, హో మాలు, కుంకు మ పూజ లు నిర్వహించా రు. అమ్మవా రు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాలనీ లోని భక్తులు పెద్ద సంఖ్య లో హాజరై అమ్మవారి ని దర్శించుకొ ని మొక్కు లు చెల్లించుకున్నా రు.

Nimishamba Temple
నిమిషాంబదేవి ఆలయంలో కుంకుమ పూజలు

కోలాటాలతో సందడి

శాకంబరి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం నిమిషాంబదేవి అమ్మవారి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. డీజేతో భక్తి పాటలతో కాలనీ హోరెత్తిపోయింది. కాలనీలోని మహిళలందరూ కోలాటలాలతో నృత్యాలు చేసి కనువిందు చేశారు. అమ్మవారి రథయాత్ర కాలనీలో ప్రధానవీధుల మీదుగా సందడిగా సాగింది.

READ MORE  విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి
Nimishamba Temple
పూజల్లో పాల్గొన్న కాలనీకి చెందిన మహిళలు
Nimishamba Devi Shakambari Utsavalu
నిమిషాంబదేవి అమ్మవారి రథయాత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *