ట్రక్ డ్రైవర్లకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలో జాతీయ రహదారులపై 1,000 ఆధునిక విశ్రాంతి భవనాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవే (National Highways)లపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. మొదటి దశలో ప్రభుత్వం 1,000 కేంద్రాలను నిర్మిస్తుంది. ఈ కేంద్రాల్లో డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవచ్చు, వీరికి తాగునీటి తోపాటు మరుగుదొడ్ల అందుబాటులో ఉంటాయి.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “డ్రైవర్లు మొబిలిటీ రంగంలో ఒక ముఖ్యమైన భాగం. వారు అలుపెరగకుండా గంటల తరబడి వాహనాలను నడుపుతూనే ఉంటారు. కానీ వారికి సరైన విశ్రాంతి స్థలం అందుబాటులో లేదు. వారికి తగిన సమయం కూడా దొరకదు. సరైన విశ్రాంతి లేకపోవడం నిద్రలేమీకారణంగా కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది.”
ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాల ఆందోళనలను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు అందుకే అన్ని జాతీయ రహదారుల (National Highways)పై డ్రైవర్లకు ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, టాయిలెట్లు, పార్కింగ్, విశ్రాంతి సౌకర్యాలతో కూడిన ఆధునిక భవనాలను అభివృద్ధి చేయడానికి “కొత్త పథకం” తీసుకొచ్చే పనిలో ఉందని ప్రధాన మంత్రి పిటిఐ నివేదించారు.
ట్రక్కు, టాక్సీ డ్రైవర్లకు జీవన సౌలభ్యం, ప్రయాణ సౌలభ్యం రెండింటికీ ప్రోత్సాహాన్ని ఇస్తుందని, తద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రమాదాలను నివారించడంలో కూడా సహాయపడుతుందని ప్రధాని మోదీ అన్నారు.
భారీ వాహనాల్లో ఏసీతో కూడిన క్యాబిన్లు
అక్టోబర్ 1, 2025న లేదా ఆ తర్వాత తయారు చేయబోయే అన్ని కొత్త ట్రక్కులలో డ్రైవర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లను కలిగి ఉండాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ( Ministry of Road Transport and Highways) ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా మూడు రోజుల ఎక్స్‌పోలో 50 కంటే ఎక్కువ దేశాల నుండి 800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఇది ఫిబ్రవరి 1 నుండి 3 వరకు ఢిల్లీలో కొనసాగుతోంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..