
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు
వైరల్ వీడియోలో ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ విషయమై సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే మాట్లాడుతూ నిందితుడిని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని తెలిపారు.
మీడియాతో ఏఎస్పీ పాట్లే మాట్లాడుతూ, "మేము నిందితుడిని (ప్రవేష్ శుక్లా) అదుపులోకి తీసుకున్నాం. అతన్ని విచారిస్తున్నాం. విచారణ పూర్తయ్యాక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. కాగా నిందితుడిపై పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294, 504, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విషయాన్ని తెలుసుకొని గ్రహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై ఎన్‌ఎస్‌ఏ వి...