Zakir Hussain | జాకీర్ హుస్సేన్ మరణ వార్త.. అనేక ట్విస్టులు
Zakir Hussain : ప్రఖ్యాత తబ్లా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణవార్త యావత్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన అభిమానులను తీవ్రంగా కలచివేసింది. సోషల్ మీడియాను ఈ వార్తలు ఆదివారం రాత్రి కుదిపేశాయి. వీటి ఆధారంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా జాకీర్ హుస్సేన్ మరణ వార్తను ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇదే క్రమంలో ఆయన మేనల్లుడు అమీర్ అవ్లియా స్పందించారు. Zakir Hussain Passed awayబతికే ఉన్నారని..జాకీర్ హుస్సేన్ మరణించారనే వార్తలను అమీర్ ఖండించారు. ఈ తప్పుడు సమాచారాన్నినిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. 'మా మామ జాకీర్ హుస్సేన్ ఇంకా బతికే ఉన్నారు' అని అమీర్ X హ్యాండిల్ ద్వారా తెలిపారు. 'మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదు. దీన్ని ఆపేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని ఆయన అభిమానులందరికీ ఆయన ఆరోగ్యం కోసం ప్రా...