Naraka Chaturdashi 2024 | దీపావళి పండుగలో భాగంగా నరక చతుర్దశిని దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఎంతో ఉత్సాహంతో భక్తితో జరుపుకుంటారు. నరక చతుర్దశి అంటే చెడుపై మంచి సాధించిన రోజు. అందుకే ఈ రోజున దేశమంతటా దీపాలు వెలిగిస్తారు. ఈ పండుగకు సంబంధించిన కొన్ని కథలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
నరకాసురుని వధ: రాక్షస రాజైన నరకాసురుడు భూమిపై ప్రజలను హింసిస్తుంటాడు. అతడి హింసను భరించలేక, ప్రజలు సహాయం కోసం శ్రీకృష్ణుడిని, కాళికాదేవిని ప్రార్థించారు. అయితే నరకాసురుడిని శ్రీకృష్ణుడు చంపాడని కొన్ని పురాణ కథలు చెబుతుండగా.. మరికొన్ని కాళీ దేవి చేతిలో హతమయ్యాడని చెబుయి. అందుకే ఈ రోజును కాళీ చౌదాస్ అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. దీపావళికి ముందు అమావాస్య రోజున నరక చతుర్దశిని జరుపుకుంటారు.
భారతదేశంలో నరక చతుర్దశి ఆచారాలను అనేక రకాలుగా పాటిస్తారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో దీన్ని పంట పండుగలా జరుపుకుంటారు. హనుమంతుడిని ఈ రోజున భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో బియ్యం, బెల్లం, నెయ్యి, నువ్వుల గింజలతో కొబ్బరికాయలతో నైవేద్యం పెట్టి పూజిస్తారు. ఈ నెలలో పండే తాజా పంట నుంచి వరి లభిస్తుంది. ప్రత్యేక పూలు, నూనె, చందనం ఉపయోగించి పూజలు నిర్వహిస్తారు.
సాధారణంగా, ప్రజలు ఈ రోజున సాధారణంగా మిగతా రోజుల కంటే ముందుగానే మేల్కొంటారు, ప్రత్యేకమైన మూలికా నూనెలతో మర్దన చేసుకుంటారు. కర్మ స్నానం ఆచరిస్తారు. దీన్నే అభయంగన స్నానం అని కూడా అంటారు. ఈ స్నానానికి ఉపయోగించే నువ్వుల నూనె.. కష్టాల నుంచి రక్షించడంలో నమ్ముతారు.
అభ్యంగన స్నానం తర్వాత శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరిస్తారు. ఆ తర్వాత ఇంటిలో లేదా ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నరకచతుర్ధశి రోజున పూర్వీకులకు వారికి ఇష్టమైన భోజనం కూడా అందిస్తారు.
రకరకాల పండి వంటలు, స్వీట్లతో అల్పాహారం మధ్యాహ్న భోజనం చేస్తారు. ప్రత్యేకంగా తీపి వంటకాలను బంధువులతో పంచుకుంటారు. సాయంత్రం చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా బాణాసంచా కాలుస్తారు.
పశ్చిమ బెంగల్ లో భూత్ చతుర్ధశి
పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజును భూత్ చతుర్దశి అని కూడా పిలుస్తారు, ఈ రోజున తమ పూర్వికుల ఆత్మలు భూమిపై ఉన్న తమ ప్రియమైన వారిని చూడడానికి వస్తాయని నమ్ముతారు. ఈ రోజున 14 మంది పూర్వీకులు కుటుంబాన్ని సందర్శిస్తారని కొందరు నమ్ముతారు కాబట్టి ఇంటి చుట్టూ 14 దీపాలు వెలిగిస్తారు.
గోవాలో ఇలా..
గోవాలో చెడుకు ప్రతీకగా నరకాసురుని పేపర్ దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. ఇది తరువాత బాణసంచా, గడ్డితో నిండి ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ దిష్టిబొమ్మలను దహనం చేసి, బాణసంచా కాల్చిన తర్వాత ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. చెడును అణిచివేసేందుకు ప్రతీకగా కరీట్ అనే బెర్రీని పాదాల కింద నలిపిస్తారు. ఆ తర్వాత రుచికరమైన వంటకాలను బంధువులు, స్నేహితులతో కలిసి సేవిస్తారు.
తమిళనాడులో లక్ష్మిపూజ
తమిళనాడులో ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి పూజ చేస్తారు. వారు ఈ రోజున ప్రత్యేకమైన ఆహార నియంత్రణ లేదా ”నోంబు” అని పిలిచే ఉపవాసాన్ని కూడా పాటిస్తారు.
దీపావళి 2024 కేలండర్
- మొదటి రోజు : ధన్తేరాస్ అక్టోబర్ 29, మంగళవారం
- రెండో రోజు : నరక చతుర్దశి (చోట్టి దీపావళి) అక్టోబర్ 31, గురువారం
- మూడో రోజు : లక్ష్మీ పూజ (దీపావళి పండుగ) నవంబర్ 01, శుక్రవారం
- నాలుగో రోజు : గోవర్ధన్ పూజ నవంబర్ 02, శనివారం
- ఐదో రోజు : భాయ్ దూజ్ నవంబర్ 03, ఆదివారం
- పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి అక్టోబరు 30 ఉదయం 01:15 గంటలకు మొదలవుతుంది. మరుసటి రోజు అక్టోబరు 31 న మధ్యాహ్నం 03:52 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నరక చతుర్దశిని 31 అక్టోబర్ 2024న జరుపుకుంటారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..