Motorola Edge 40 Neo: మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.

Motorola Edge 40 Neo: మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్  వచ్చేసింది.

Lenovo యాజమాన్యంలోని మోటొరోలా బ్రాండ్ నుంచి సరికొత్త 5G  స్మార్ట్‌ఫోన్‌ Motorola Edge 40 Neo 5G గురువారం భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఎడ్జ్-సిరీస్ కొత్త ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగు MediaTek Dimensity 7030 SoC ప్రాసెసర్ తో రన్ అవుతుంది. మోటరోలా ఎడ్జ్ 40 నియో
50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని
కలిగి ఉంది. Motorola Edge 40 Neo ఇతర వాటితో పాటు Realme 10 Pro+ , iQoo Neo 6, Samsung Galaxy M53 5G వంటి వాటితో పోటీ పడుతుంది..

Motorola Edge 40 Neo ధర

భారతదేశంలో Motorola Edge 40 Neo బేస్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.23,999. 12 GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 25,999 గా ఉంది . ఫోన్ మూడు రంగులలో వస్తుంది, కాగా మోటోరోలా కంపెనీ ఇండియా వెబ్‌సైట్ తోపాటు ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 28 రాత్రి 7:00 గంటలకు నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి.

READ MORE  జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..

ప్రత్యేక ఆఫర్

ప్రత్యేక లాంఛ్ ఆఫర్ కింద హ్యాండ్‌సెట్‌ పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ లాంచ్ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుందనేది ప్రకటించలేదు. మోటో ఎడ్జ్ 40 నియోపై లాంచ్ ఆఫర్‌లలో బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, EMI ద్వారా చేసిన కొనుగోళ్లకు 1,000 తగ్గింపు ఉంది.

స్పెసిఫికేషన్లు

డ్యూయల్ సిమ్ (నానో) Motorola Edge 40 Neo Android 13 లో నడుస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్-HD+(1,080×2,400 పిక్సెల్‌లు)
poLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Motorola హ్యాండ్‌సెట్ పై రెండేళ్ల పాటు OS అప్‌డేట్స్ ఇస్తామని కంపె నీ ప్రకటించింది. ఇది ఆక్టా-కోర్ 6nm
MediaTek డైమెన్సిటీ 7030 SoC ప్రాసెసర్ తో 12GB వరకు LPDDR4X RAM, 256GB ఇంటర్నల్ స్టేరేజ్ ను కలిగి ఉంటుంది.

READ MORE  Boat Storm Connect Plus Smartwatch

కెమెరాలు

మోటోరొలా Edge 40 Neo డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వెనుక వైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్, f/1.8 ఎపర్చర్ కెమెరాతోపాటు అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ మరో కెమెరా ఉటుంది. ముందు వైపు f/2.2 ఎపర్చర్ తో 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి
ఉంది. ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ విషయానికొస్తే.. Wi-Fi, బ్లూటూత్ 5.3, FM రేడియో, GPS, A-GPS, GLONASS,
గెలీలియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్  ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, SAR సెన్సార్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, తోపాటు డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి.

READ MORE  KCR | నేడు రైతుల వ‌ద్ద‌కు కేసీఆర్‌.. మూడు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే.. 

బ్యాటరీ విషయానికొస్తే 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 36 గంటల ప్లేబ్యాక్ టైం ను అందిస్తుంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *