400 సినిమాలకు పనిచేసినా.. ఒక్కటి కూడా 100 కోట్లు దాటలేదు.. కానీ ఈ హీరో ఎప్పటికీ సూపర్ స్టారే..
సెప్టెంబరు 7, 1951న జన్మించిన ముహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్‌ను ‘మాముక్క’ అని ముద్దుగా పిలుచుకుంటారు. మమ్ముట్టి (Mammootty) 400 కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు.. అయితే అతని సినిమాలేవీ 100 కోట్ల రూపాయల మార్కును దాటకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మమ్ముట్టి మలయాళం, తమిళ చిత్రాలలో పనిచేసిఅద్భుతమైన నటుడిగా గుర్తింపు పొందారు. మమ్ముట్టి కొన్ని తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించారు. మమ్ముట్టి ఐదు దశాబ్దాల క్రితం నటుడిగా అరంగేట్రం చేసి 400 చిత్రాలకు పైగా పనిచేశారు.
మమ్ముట్టి (Mammootty) మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఏడు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు. 13 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌ను గెలుచుకున్నారు. 1998లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును కూడా ప్రదానం చేసింది. 2022లో కేరళ ప్రభ అవార్డుతో సత్కరించారు.
న్యాయవాదిగా Mammootty ప్రాక్టీస్..
మమ్ముట్టి వృత్తిరీత్యా న్యాయవాది. రెండు సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అతను 1971లో జూనియర్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రపంచంలోకి ప్రవేశించాడు. అతను తన మొదటి కొన్ని చిత్రాలలో సజిన్ పేరుతో పనిచేశాడు. మమ్ముట్టి 1980లో సుల్ఫత్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు దుల్కర్ సల్మాన్ (dulquer salmaan), కుమార్తె సురుమి.
టెలివిజన్ చానళ్లు, ప్రొడక్షన్ కంపెనీలు..
మమ్మూట్టి మలయాళ టెలివిజన్ ఛానెల్స్ ను కూడా నిర్వహిస్తున్నారు. కైరాలి టీవీ, కైరాలి న్యూస్, కైరాలి వీలను నడుపుతున్న ఆయన.. మలయాళ కమ్యూనికేషన్స్‌కు చైర్మన్ గా ఉన్నారు. మరోవైపు డిస్ట్రిబ్యూషన్-ప్రొడక్షన్ బ్యానర్ ప్లేహౌస్, మమ్ముట్టి కంపానీతో సహా ప్రొడక్షన్ వెంచర్‌లను కూడా నడిపిస్తున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి నుంచి కథల్, బజూకా, బ్రహ్మయుగం తదితర చిత్రాలు రాబోతున్నాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.