Mallikarjun Kharge | చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే..

Mallikarjun Kharge | చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే..

Mallikarjun Kharge : ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయారు. ఈ వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడుతుండ‌గా మ‌రో వివాదం అక్క‌డి హ‌స్తం పార్టీకి కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతోంది. బెంగళూర్‌కు సమీపంలోని ఓ ఏరోస్పేస్‌ పార్క్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఓ ట్రస్ట్‌కు ఏకంగా 5 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించడం దుమారం రేపుతున్న‌ది. ఖర్గే కుమారుడు రాహుల్‌ ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్ కు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) భూ కేటాయించ‌డం అధికార దుర్వినియోగమని, కర్ణాటక ప్ర‌భుత్వం బంధుప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వీయ ఎక్స్ వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేశారు.

READ MORE  Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ

ఈ వివాదంపై మ‌ల్లికార్జున‌ ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధార్ధ విహార్‌ ట్రస్ట్‌కు అప్ప‌నంగా కట్టబెట్టారని, ఈ ట్రస్ట్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్‌ ఖర్గే ఇతర కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారని అమిత్‌ పేర్కొన్నారు. హైటెక్‌ డిఫెన్స్‌ ఏరోస్పేస్‌ పార్క్‌ కోసం కేఐఏడీబీ పక్కనపెట్టిన 45.94 ఎకరాల స్ధలంలో ఈ 5 ఎకరాలు భాగమని వివరించారు. స్ధలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సామాజిక కార్యకర్త దినేష్‌ కలహళ్లి కర్ణాటక గవర్నర్‌ తావర్‌ చంద్‌ గహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు.

READ MORE  New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఇదిలా ఉండగా.. రాహుల్ ఖర్గే అర్హత కలిగిన వ్యక్తి అని సింగిల్ విండో ఆమోదం ద్వారా మెరిట్ ఆధారంగా సైట్ ఆమోదించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ అన్నారు.  ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎలాంటి రాయితీలు తీసుకోలేదని తెలిపారు.  సాధారణ కేటగిరీ రేట్ల ప్రకారం పూర్తి మొత్తాన్ని చెల్లించారని  తెలిపారు.  ఇదే విషయమై రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ఆమోదించబడిన సైట్ వాణిజ్య ప్రయోజనాల కోసంకాదని, అది పారిశ్రామిక ప్లాట్ కాదని, విద్యా ప్రయోజనాల కోసమేని స్పష్టం చేశారు. ఆ స్థలంలో మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

READ MORE  vande bharat sleeper train : వచ్చే ఏడాది స్లీపర్ కోచ్ వందేభారత్ ట్రైన్ వస్తోంది..

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *