Maha Lakshmi Scheme | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాల్సిందే..
ఆటో కార్మికులు, క్యాబ్ డ్రైౌవర్ల డిమాండ్..
బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సర్వత్రా నిరసన
గిరాకీ లేక రోడ్డున పడుతున్నాం..
అప్పులకు కిస్తీలు కూడా కట్టలేపోతున్నాం..
బస్ భవన్ ముట్టడిలో ఆటో కార్మికుల ఆవేదన
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
హైదరాబాద్: మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheme) లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో ఆటో డ్రైవర్ల జీవితాలపై పెను ప్రభావం చూపింది.. ఉచితం కావడంతో మహిళలు బస్సు ప్రయాణాల వైపు మొగ్గు చూపడంతో ఆటోలకు పని లేకుండా పోయింది. ఫలితంగా డ్రైవర్లు (Auto drivers) అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇటు ప్రయాణికులు లేక ఆటోల ద్వారా ఆదాయం కోల్పోవడం మరో బతుకు దెరువు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు రహదారులపై రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా మంగళవారం హైదరాబాద్ లో బస్ భవన్ ను ఆటో డ్రైవర్లు ముట్టడించడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.
మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడిలో పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheme) వల్ల తమకు గిరాకీ పడిపోయిందని కార్మికులు, గతంలో రోజుకు రూ.1000 నుంచి రూ.1500 సంపాదించేవారమని, ఇప్పుడది రూ.400లకు పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని, కనీసం కిస్తీలు కూడా కట్టలేకపోతున్నామని చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయానికి రోజు రూ.1000 వరకు గండి పడిందని బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, వారికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇదే విషయమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆటో కార్మికులు రోడ్లెక్కుతున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.