Lok Sabha Election 2024 : 3వ దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ షురూ.. 12 రాష్ట్రాలు.. 94 సెగ్మెంట్లు..
Lok Sabha Election 2024 : మే 7న 12 రాష్ట్రాల్లోని 94 నియోజక వర్గాల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12, 2024 శుక్రవారం ప్రారంభమైంది. మూడో దశలో భాగంగా అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ – డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 19, 2024. నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 20. అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణయించింది. 18వ లోక్‌సభను ఎన్నుకునేందుకు ఏడు దశల ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Lok Sabha Election 2024 : ఫేజ్ 3 షెడ్యూల్ ఇదే..
- ప్రకటన & ప్రెస్ నోట్ జారీ: 16 మార్చి 2024
- గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ: 12 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
- నామినేషన్లు వేయడానికి చివరి తేదీ: 19 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
- నామినేషన్ల పరిశీలన తేదీ: 20 ఏప్రిల్ 2024 (శనివారం)
- నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ: 22 ఏప్రిల్ 2024 (సోమవారం)
- పోల్ తేదీ: 07 మే 2024 (మంగళవారం)
- కౌంటింగ్ తేదీ: 04 జూన్ 2024 (మంగళవారం)
Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..