
నన్ను క్షమించండి…
*నన్ను క్షమించండి*
======🎊=======
నన్ను క్షమించండి...
తేనెపూతల మాటలతో
మెప్పించలేక పోయినందుకు..నన్ను క్షమించండి..
పూటకో మాటలా నైజాన్ని మార్చుకోనందుకుకటువు మాటతీరుతోనైనా
బ్రతుకు గమనం బోధించాలనుకున్నా..కష్టాలెన్నో చూసిన అనుభవంతో
పదేపదే జాగ్రత్తలు వల్లెవేశా.వెలివేత బహుమతి అందుతుందనుకోలేదు.
బంధాలమధ్య బీటలు చేరుతాయనుకోలేదు..నన్ను నన్నుగా ఒప్పుకోలేని బంధంలో
నిజమైన ప్రేమ.. ఆప్యాయత
నాకు లభిస్తాయని నేనెప్పుడూ అనుకొను..
అందుకే దూరమైనా నేరమేమీ కాదు..అయినా మనసులో ఒక్క ఆశయితే ఉంది
కాలమే గురువుగా మారుతుందని..
నేటి అపార్థమే రేపు నిలకడగా
ఎన్నో విలువైన అర్ధాలను చెబుతుందని..
నాలోని స్వచ్ఛతను మీ భాషలో
తప్పకుండా బోధపరుస్తుందని..!అనూశ్రీ గౌరోజుఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పం...