Lava Agni 3: రెండు డిస్‌ప్లేతో తక్కువ బడ్జెట్‌లోనే లావా స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు,. ధరెంతంటే?

Lava Agni 3: రెండు డిస్‌ప్లేతో తక్కువ బడ్జెట్‌లోనే లావా స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు,. ధరెంతంటే?

Lava Agni 3 Price : దేశీయ స్మార్ట్‌ ఫోన్ కంపెనీ లావా.. త‌క్కువ‌ బడ్జెట్‌లో అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్లను విడుదల చేసింది. అయితే ఈసారి సాధార‌ణ ఫోన్ కాదు. ఇది వెరైటీగా తాజాగా సెకండరీ డిస్‌ప్లేతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి ప‌రిచ‌యం చేసింది. లావా అగ్ని 3 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను శుక్రవారం రిలీజ్‌ చేసింది. ఇదివ‌ర‌కు అగ్ని 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయ‌గా ఇప్పుడు దాని కొన‌సాగింపుగా అగ్ని 3ని తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

లావా అగ్ని 3 ధర..

Lava Agni 3 Price లావా ఈ ఫోన్‌ను రెండు వేరియంట్ల‌లో విడుదల చేసింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999. అయితే, కంపెనీ ఈ ఫోన్ తో ఛార్జర్‌ను అందించడంలేదు. కస్టొమ‌ర్లు దీన్ని ఛార్జర్‌తో కొనుగోలు చేయాలనుకుంటే అద‌నంగా రూ. 2,000 చెల్లించాల్సిందే. ఫోన్‌తో పాటు 66W ఛార్జర్ అందుబాటులో ఉంటుంది.

READ MORE  Motorola Edge 40 Neo: మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.

మరో వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ ఫోన్‌ ధర రూ.24,999. దీంతో పాటు ఛార్జర్ కూడా లభిస్తుంది. రూ.499ల‌కు అమెజాన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఈస్మార్ట్ ఫోన్ అమ్మ‌కాలు అక్టోబరు 9 నుంచి మొద‌ల‌వుతాయి. ప్రీ-ఆర్డర్ చేసిన వినియోగదారులు అక్టోబర్ 8 నుంచి కొనుగోలు చేసుకోవ‌చ్చు.

స్పెసిఫికేషన్స్ ఇవే..

లావా అగ్ని 3 స్మార్ట్ ఫోన్‌ డ్యూయల్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. ఫోన్ 6.78-అంగుళాల AMOLED మెయిన్‌ డిస్‌ప్లే తోపాటు 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వ‌స్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300X ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8GB RAM, 256GB స్టోరేజ్ ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ లో 50MP + 8MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను చూడ‌వ‌చ్చు. ముందు భాగంలో, కంపెనీ 16MP కెమెరాను అందిస్తోంది. ఈ ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 66W ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌ ఇస్తుంది. ఇందులో గూగుల్ లేటెస్ట్‌ Android 14 వెర్ష‌న్ ఉంది. కాగా ఈ ఫోన్ కు 3 ఓఎస్ అప్‌గ్రేడ్స్‌తోపాటు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

READ MORE  30గంటల ప్లే బ్యాక్ తో iQoo TWS Air Pro Earbuds

ఫోన్‌లో ‘యాక్షన్’ బటన్ ను కూడా అమ‌ర్చారు. ఇది రింగర్, సైలెంట్ మోడ్‌లకు మారడానికి, ఫ్లాష్‌లైట్ ఫీచర్‌ను ఆన్ చేయడానికి లేదా కెమెరా కోసం షట్టర్ బటన్‌గా పని చేయడానికి ఉపయోగించవచ్చు.

హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 112-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, ఎలక్ట్రానిక్ ఇమేజ్‌తో 3x ఆప్టికల్ జూమ్‌తో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో EISతో కూడిన 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

స్మార్ట్ ఫీచర్స్.. 

లావా అగ్ని 3లో 5G, 4G LTE, Wi-Fi-6E, బ్లూటూత్ 5.4, GPS, NavIC మరియు USB టైప్-సి పోర్ట్, డాల్బీ అట్మోస్ కనెక్టివిటీ ఎంపికలతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. ఇందులో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఈ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.

READ MORE  1.43-అంగుళాల  అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Phoenix స్మార్ట్‌వాచ్

Lava Agni 3 స్మార్ట్ ఫోన్‌ 66W ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో వ‌స్తుంది. ఇది ఫోన్‌ను 19 నిమిషాల్లో 50 శాతానికి ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. అంతేకాకుండా ఇది 163.7×75.53×8.8mm డైమెన్ష‌న్స్ తో 212g బరువు ఉంటుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *