Friday, April 18Welcome to Vandebhaarath

Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత …

Spread the love

Krishna Janmashtami 2023 : హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి, అష్టమి రోహిణి వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి 2023 కోసం ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ పండుగ ప్రాముఖ్యతను ఒకసారి పరిశీలిద్దాం.

శ్రీ కృష్ణ జన్మాష్టమి చరిత్ర

శ్రీ కృష్ణ జన్మాష్టమి, హిందూ మతంలో అతి ముఖ్యమైన పండుగ ల్లో ఒకటి. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం (అవతారం) అయిన శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా నిర్వహిస్తుంటారు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో సుమారు 5,000 సంవత్సరాల క్రితం మధురలో జన్మించాడు. ఆయన జీవిత కథ, భగవద్గీత, భాగవత పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచి ఉంది.

READ MORE  Medaram Maha Jatara 2024 : మేడారం జారతరకు వెళ్తున్నారా? అయితే ఈ ఆలయాలను మిస్ కావొద్దు..

కృష్ణాష్టమి అని ఎందుకు అంటారు?

శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంలో జన్మించడం, అలాగే దేవకీ మాతకు 8వ సంతానంగా, ఎనిమిదవ తేదీన శ్రీకృష్ణుడు జన్మించాడు. సంస్కృతంలో జమ్నా అనే పదానికి జననం అని అర్థం అలాగే అష్ట అంటే ఎనిమిది. 8వ సంఖ్యకు శ్రావణ మాసంలో కృష్ణపక్షం వస్తుంది. వీటన్నింటి కారణంగా శ్రీకృష్ణుడి పుట్టిన రోజును కృష్ణాష్టమి అనే పేరు వచ్చింది..

శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ ప్రాముఖ్యత ?

హిందూ క్యాలెండర్ ప్రకారం , శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని ఎనిమిదో రోజు (అష్టమి తిథి)న జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా ఆగస్టు-సెప్టెంబర్‌లో రోహిణి నక్షత్రంలో వస్తుంది. భక్తులు కృష్ణాష్టమి పండుగను భారతదేశంలోనే కాకుండా కొన్ని విదేశాలలో కూడా చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమిలోని అత్యంత ఆసక్తికరమైన ముఖ్యమైన అంశం దహీ హండి (ఉట్టి కొట్టే పండుగ). ఉట్టి కొట్టే వేడుక అనేది శ్రీ కృష్ణ భగవానుడికి అత్యంత ఇష్టమైన కార్యకలాపాన్ని వర్ణిస్తుంది. ఇక్కడ యువకుల బృందాలు ఒక పిరమిడ్‌ను ఏర్పాటు చేసి పెరుగుతో (దహీ) నింపిన మట్టి కుండను (హండి) పగలగొడతారు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలోనే కృష్ణ జయంతిని అర్ధరాత్రి వరకు జరుపుకుంటారు. కృష్ణ జననం మరుసటి రోజు, భక్తులు ఉట్టికొట్టే వేడుకలు (దహీ హండి) పండుగను జరుపుకుంటారు.

READ MORE  Arogya Maitri Cube | ఆకాశం నుంచి దిగివచ్చిన ఆస్పత్రిని చూడండి.. ప్రపంచంలోనే తొలిసారి భారత్ లో ఆవిష్కరణ..

Krishna Janmashtami 2023.. తేదీ ముహూర్తం

20203లో రోహిణి నక్షత్రం, అష్టమి తిథి జన్మాష్టమి రాత్రి వస్తుంది. అసలు పండుగ జరుపుకునే తేదీ విషయంలో గందరగోళం నెలకొనడానికి ఇదే ప్రధాన కారణం. దృక్ పంచాంగ్ ప్రకారం, కృష్ణ జన్మాష్టమి వరుసగా రెండు రోజులు వస్తుంది. అష్టమి తిథి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:37 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7 సాయంత్రం 4:14 గంటలకు ముగుస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని రెండు రోజులు జరుపుకోవడం వెనుక ప్రధాన కారణం ఇదే.

పండుగను ఎలా జరుపుకుంటాం?

  • కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాంహంగా వేడుకలను జరుపుకుంటారు.
  • ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటించడం, పవిత్రమైన భగవద్గీత శ్లోకాలు వినడం, శ్రీ కృష్ణుని కథను వినడం లేదా పఠించడం ద్వారా భక్తులు శ్రీకృష్ణుని పట్ల తమ భక్తిని చాటుకుంటారు.
  • శ్రీకృష్ణుని ఆలయాలను పూలమాలలు, అలంకార వస్తువులతో అలంకరిస్తారు.
  • కృష్ణ జయంతి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుని చిన్ననాటి జ్ఞాపకాలను వర్ణిస్తూ రాధా కృష్ణుల వేషధారణలో ఉన్న చిన్న పిల్లలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
  • భక్తులు కృష్ణ జననం తర్వాత, అనగా అర్ధరాత్రి తర్వాత, ముందుగా ఆరతి చేసి, ఆ తర్వాత ఇంట్లో తయారుచేసిన స్వీట్లను అందించి తమ ఉపవాసాన్నివిరమించుకుంటారు.
  • ఉపవాసం, పూజ ముగిసిన తర్వాత రుచికరమైన భోజనం తయారు చేసి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు వడ్డిస్తారు.
READ MORE  Tantalum | సట్లెజ్‌లో కనిపించిన అరుదైన లోహం టాంటాలమ్ అంటే ఏమిటి?

ఇస్కాన్ (ISKCON ) వేడుకలు

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON ) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ శ్రీ కృష్ణ జన్మాష్టమి 2023 వేడుకలను నిర్వహిస్తోంది. ఇది ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తుంది. జన్మాష్టమి కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు.. భారతదేశంలోని విభిన్న నేపథ్యాల ప్రజలను ఏకం చేసి, ఐక్యత, భక్తి, ఆధ్యాత్మిక జాగృతిని పెంపొందించే సాంస్కృతిక మహోత్సవం. ఈ దేవాలయాలు విభిన్నమైన అనుభవాలను అందిస్తాయి. ప్రతి దానికి ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాటిని సందర్శించడం వలన శ్రీకృష్ణుడితో ముడిపడి ఉన్న గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంలో మననం చేసుకునే అవకాశం లభిస్తుంది.

చివరగా అందరికీ శ్రీక‌ృష్ణాష్టమి శుభాకాంక్షలు!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *