Posted in

Jio cheapest plans | ముఖేష్ అంబానీ మాస్టర్‌స్ట్రోక్, అపరిమిత కాలింగ్, హై-స్పీడ్ డేటాతో సరికొత్త రీచార్జ్ ప్లాన్లు.. త్నుత ర 90 రోజుల పాటు కేవలం రూ.

Jio cheapest plans
Reliance Jio Prepaid Plans
Spread the love

Jio cheapest plans | ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కు ఇటీవ‌ల కాలంలో విప‌రీతంగా ప్రజాదరణ పెరుగుతోంది. దీంతో భారతదేశపు అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani)  నేతృత్వంలోని రిలయన్స్ జియో అలెర్ట్ అయింది. వినియోగ‌దారుల‌ను నిలుపుకునేందుకు, కొత్త స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను ఆక‌ర్శించేందుకు రెండు కొత్త టారిఫ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది,

జియో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన‌ రూ. 899, రూ. 999 ప్లాన్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరుసగా 90, 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది, వినియోగదారులకు రోజుకు రూ. 10 కంటే తక్కువ ధరతో అపరిమిత కాలింగ్, డేటాను అందిస్తోంది.

Reliance Jio రీచార్జి ప్లాన్‌ రూ. 899

రిలయ‌న్స్‌ Jio రూ. 899 ప్లాన్ 5G- హ్యాండ్‌సెట్‌లను కలిగి ఉన్న వినియోగదారుల కోసం 2GB రోజువారీ హై-స్పీడ్ డేటా, అపరిమిత 5G డేటాను అందిస్తుంది, అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఉచిత జాతీయ రోమింగ్ వంటి ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే JioTV, JioCinema, JioCloud వంటి అనుబంధ సేవలను కూడా ఆస్వాదించ‌వ‌చ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వాలిడిటీని కలిగి ఉంటుంది.

Reliance Jio రూ. 999 ప్లాన్

రూ.899 ప్లాన్ మాదిరిగానే, రూ.999 టారిఫ్ ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ హై-స్పీడ్ డేటాను, 5G స్మార్ట్ ఫోన్ క‌లిగి ఉన్న వినియోగదారులకు అపరిమిత 5G డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ JioTV, JioCinema మరియు JioCloud వంటి జియో సేవలకు యాక్సెస్ మాత్ర‌మే కాకుండా అపరిమిత కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Jio cheapest plans : ఈ సంవత్సరం జూలైలో Jio కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు, మొబైల్ టారిఫ్‌లను పెంచేసింది. దీంతో జియో పెద్ద సంఖ్యలో వినియోగ‌దారుల‌ను కోల్పోతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో వినియోగదారులను ఆకర్షించడానికి జియో కొత్త ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. నివేదికల ప్రకారం, BSNL జూలై, ఆగస్టు మధ్యకాలంలో 55 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చుకుంది, రిలయన్స్ జియో నష్టాలను చ‌విచూసింది. ఈ సమయంలో ఏకంగా 40 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *