Jio Bharat Phone : కేవలం రూ.999 ధరకే 4జీ ఫోన్…
రిలయన్స్ జియో నుంచి మరో బడ్జెట్ ఫోన్
రిలయన్స్ జియో మార్కెట్లోకి మరో కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Jio Bharat Phone ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో ఒక మిలియన్ జియో భారత్ ఫోన్‌ల
బీటా ట్రయల్‌ను జూలై 7 నుండి 6,500 ప్రాంతాల్లో ప్రారంభించనుంది. ఈ కొత్త ఇంట ర్నెట్ ఎనేబుల్డ్ ఫోన్ ధర కేవలం రూ. 999 మాత్రమే.. ఈ ఏడాది చివర్లో JioPhone 5G
స్మార్ట్ ఫోన్ ను కూడా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఇటీవల లీక్ అయిన హ్యాండ్‌సెట్ ఫొటోలను బట్ట చూస్తే వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది.
కొత్త ఫోన్ లాంచ్ తో భారతదేశంలో డిజిటల్ సాధికారత దిశగా ఒక అడుగు పడినట్ల్లైంది. రిలయన్స్ జియో ఫోన్.. బీటా టెస్టింగ్ తో జూలై 7 నుండి ప్రారంభమవుతుంది. ట్రయల్ దశలో కంపెనీ 6,500 ప్రాంతాల్లో 1 మిలియన్ ఫోన్‌లను పంపిణీ చేయనుంది.
ఆకాశ్ అంబానీ ఏమన్నారంటే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లు ముఖ్యంగా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయలేని, ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడంలో సమస్యను ఎదుర్కొంటున్న కస్టమర్ల ను లక్ష్యంగా చేసుకున్నాయి. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ.. మాట్లాడుతూ.. “ఇంకా 2G యుగంలో 250 మిలియన్ల మంది ఉన్నారని తెలిపారు. ఈ వినియోగదారులు ఇంటర్నెట్‌లోని ప్రాథమిక ఫీచర్లను వినియోగించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
దేశం ఇప్పుడు 5G వైపు వెళుతున్నందున, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న బడ్జెట్ ఫోన్‌లను విక్రయించడం ద్వారా భారతదేశాన్ని 2G-ముక్త్ భారత్‌గా మార్చాలని కంపెనీ
లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, రాబోయే JioPhone నలుపు రంగులో వస్తుందని సమాచారం. ఇందులో డ్యుయల్ రియర్ కెమెరా మాడ్యూల్ టాప్ సెంటర్‌లో 13-మెగాపిక్సెల్ AI కెమెరాతో పాటు 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌తో కలిసి ఉండవచ్చని తెలుస్తోంది.
కొత్త
రీచార్జ్ ప్లాన్స్
రిలయన్స్ జియో కొత్త జియో భారత్ ఫోన్ తోపాటే పలు రీచార్జ్ ప్లాన్‌ల (Jio Bharat plans) ను కూడా ప్రారంభించింది. వీటి ధరలు ధర రూ.123, రూ.1234. రూ.123 ప్లాన్ లో మొత్తం 14GB డేటా (రోజుకు 0.5GB) లభిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. అలాగే అపరిమిత వాయిస్ కాల్‌లను కూడా అందిస్తుంది.
వార్షిక రూ.1,234 ప్లాన్ మొత్తం 168GB డేటా (రోజుకు 0.5 GB డేటా), అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్లు Jio బ్రాండ్ ఫోన్లకు మాత్రమే..
ఇతర బ్రాండ్‌ల ఫోన్లతో ప్రారంభించబడిన జియో భారత్ ఫోన్ (ప్రస్తుతానికి కార్బన్ మాత్రమే) రెండు ప్లాన్‌లతో వస్తుంది – రూ. 179 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. వార్షిక రూ. 1799 ప్లాన్. రెండు ప్లాన్‌ల ప్రయోజనాలు జియో భారత్ ప్లాన్‌ల మాదిరిగానే ఉంటాయి.
ఎలక్ట్రిక్ వాహనాల( Electric Vehicles)కు సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.. జనరల్ న్యూస్ కోసం వందేభారత్ ను వీక్షించండి.. న్యూస్ అప్ డేట్స్ కోసం ట్విటర్ లో ఫాలో అవండి