
Jeet Adani : వికలాంగులైన కొత్తగా పెళ్లైన యువతులకు చేయూతనందించేందుకు దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ (Jeet Adani ) ఆయన కోడలు దివా (Diva Shah) ముందుకు వచ్చారు. మంగళ సేవ (Mangal Seva) పేరుతో 500 మంది వికలాంగ యువతలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బుధవారం (ఫిబ్రవరి 5) ప్రకటించారు .
జీత్ అదానీ తన వివాహానికి రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన నివాసంలో 21 మంది కొత్తగా వివాహం చేసుకున్న వికలాంగులైన మహిళలను వారి భర్తలను కలిశారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో దివా షాను ఆయన వివాహం (Jeet Adani Diva Shah Wedding) చేసుకోనున్నారు.
ఈ విషయమై గౌతమ్ అదానీ X పై తన ఆనందాన్ని పంచుకున్నారు, జీత్, దివా కలిసి వారి ప్రయాణంలో మొదటి అడుగు ఈ గొప్ప లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. మంగళ సేవ అనేక మంది వికలాంగ మహిళలకు వారి కుటుంబాలకు గౌరవంతోపాటు ఆనందాన్ని తెస్తుందని తెలిపారు. ఈ పవిత్ర ప్రయత్నం అనేక మంది ప్రత్యేక అవసరాలు గల యువతులు, వారి కుటుంబాలకు ఆనందం కలిగిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. జీత్ మరియు దివా ఈ సేవా మార్గంలో కొనసాగడానికి శక్తి, సామర్థ్యాన్ని ప్రసాదించాలని నేను సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాను” అని అదానీ అన్నారు.
Jeet Adani : అదానీ వ్యాపారాల్లో కీలక పాత్ర
జీత్ అదానీ ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు, భారతదేశం అంతటా ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తున్నారు. ఆయన అదానీ గ్రూప్ రక్షణ, పెట్రోకెమికల్స్, కాపర్ వ్యాపారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. అదానీ ఫౌండేషన్‌ను ప్రపంచ దాతృత్వ శక్తిగా విస్తరించిన తన తల్లి ప్రీతి అదానీ ప్రేరణతో జీత్ సామాజిక కార్యక్రమాల పట్ల, ముఖ్యంగా వికలాంగులకు సాయం చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.