Wednesday, December 18Thank you for visiting
Shadow

IPL 2025 వేలంలో ఆటగాళ్ల జాబితా ఇదే..

Spread the love

IPL 2025 Auction Live | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగుతోంది. క్రికెట్ ప్రీమియర్ T20 టోర్నమెంట్ తదుపరి ఎడిషన్ కోసం ఫ్రాంఛైజీలు వ్యూహరచన చేసి తమ జట్టులను ఖరారు చేస్తాయి. ఈ సంవత్సరం, 1,165 మంది భారతీయులు, 409 విదేశీ క్రికెటర్లతో సహా మొత్తం 1,574 మంది ఆటగాళ్లు IPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్నారు. పూల్‌లో 320 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్డ్ క్రీడాకారులు, 30 మంది అసోసియేట్ నేషన్స్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 366 మంది భారతీయ ఆటగాళ్లు, 208 విదేశీ ఆటగాళ్లు, అసోసియేట్ నేషన్స్‌కు చెందిన 3 మందితో సహా మొత్తం 577 మంది ఆటగాళ్లు IPL 2025 మెగా వేలంలో పాల్గొననున్నారు.

అయితే, 10 జట్లకు 204 స్లాట్‌లు మాత్రమే అందుబాటులో ఉండటంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న 204 స్లాట్‌లలో, 70 విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించారు.  కాగా తొలిరోజు వేలంగో రిషబ్ పంత్ జాక్ పాట్ కొట్టేశాడు.. లక్నో సూపర్ జెయింట్స్‌ అతడిని రూ.27 కోట్ల రికార్డు వేలంతో కైవసం చేసుకుంది. ఐపిఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. సన్‌రైజర్స్.. హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఇప్పటికీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్న పంజాబ్ కింగ్స్, అనుభవజ్ఞుడైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ.18 కోట్లకు దక్కించుకుంది.

READ MORE  IPL 2024 : ఐపీఎల్ ఫీవర్.. చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లు

IPL 2025 వేలంలో అందుబాటులోకి వచ్చిన ఆటగాళ్ల జాబితా

IPL 2025 వేలం డే 1లో క్రికెటర్లు..

  • అర్ష్‌దీప్ సింగ్ – 18 కోట్లు – పంజాబ్ కింగ్స్ (RTM)
  • కగిసో రబడ – 10.75 కోట్లు – గుజరాత్ టైటాన్స్
  • శ్రేయాస్ అయ్యర్ – 26.75 కోట్లు – పంజాబ్ కింగ్స్
  • మిచెల్ స్టార్క్ – 11.75 – ఢిల్లీ క్యాపిటల్స్
  • జోస్ బట్లర్ – 15.75 – గుజరాత్ టైటాన్స్
  • శ్రేయాస్ అయ్యర్ – 26.74 కోట్లు – పంజాబ్ కింగ్స్
  • రిషబ్ పంత్ – 27 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
  • మహ్మద్ షమీ – 10 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
  • డేవిడ్ మిల్లర్ – 7.5 కోట్లు – లక్కో సూపర్ జెయింట్స్
  • యుజ్వేంద్ర చాహల్ – 18 కోట్లు – పంజాబ్ కింగ్స్
  • మహ్మద్ సిరాజ్ – 12.25 కోట్లు – గుజరాత్ టైటాన్స్
  • లియామ్ లివింగ్‌స్టోన్ – 8.75 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • కేఎల్ రాహుల్ – 14 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
  • హ్యారీ బ్రూక్ – 6.25 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
  • ఐడెన్ మార్క్రామ్ – 2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
  • డెవాన్ కాన్వే – 6.25 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
  • రాహుల్ త్రిపాఠి – 3.4 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
  • జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ – 9 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
  • హర్షల్ పటేల్ – 8 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
  • రచిన్ రవీంద్ర – 4 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
  • రవిచంద్రన్ అశ్విన్ – 9.75 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
  • వెంకటేష్ అయ్యర్ – 23.75 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
  • మార్కస్ స్టోయినిస్ – 11 కోట్లు – పంజాబ్ కింగ్స్
  • మిచెల్ మార్ష్ – 3.40 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
  • గ్లెన్ మాక్స్‌వెల్ – 4.20 కోట్లు – పంజాబ్ కింగ్స్
  • క్వింటన్ డి కాక్ – 3.60 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
  • ఫిల్ సాల్ట్ – 11.50 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • రహ్మానుల్లా గుర్బాజ్ – 2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
  • ఇషాన్ కిషన్ – 11.25 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
  • జితేష్ శర్మ – 11 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • జోష్ హేజిల్‌వుడ్ – 12.50 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • అవేష్ ఖాన్ – 9.75 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
  • అన్రిచ్ నార్ట్జే – 6.5 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
  • ప్రసిద్ధ్ కృష్ణ – 9.50 కోట్లు – గుజరాత్ టైటాన్స్
  • జోఫ్రా ఆర్చర్ – 12.50 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
  • ఖలీల్ అహ్మద్ – 4.80 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
  • టి నటరాజన్ – 10.75 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
  • ట్రెంట్ బౌల్ట్ – 2.5 కోట్లు – ముంబై ఇండియన్స్
  • మహేశ్ తీక్షణ – 4.4 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
  • రాహుల్ చాహర్ – 3.2 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
  • ఆడమ్ జంపా – 2.4 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
  • వనిందు హసరంగా – 5.25 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
  • నూర్ అహ్మద్ – 10 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
READ MORE  Virat Kohli | చెలరేగిపోయిన కోహ్లీ.. 30వ సెంచరీతో బ్రాడ్‌మన్‌ రికార్డ్ బ్రేక్..

IPL 2025 వేలం రోజు 1లో అమ్ముడుపోని ఆటగాళ్లు:

  • డేవిడ్ వార్నర్
  • జానీ బెయిర్‌స్టో
  • దేవదత్ పడిక్కల్
  • వకార్ సలాంఖైల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *