అత్యాధునిక 3nm A17 బయోనిక్ చిప్ తో iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లు లాంచ్ అయ్యాయి..
ఐఫోన్ వేరియంట్ల స్పెసిఫికేషన్లు, ధరలు
యాపిల్ కంపెనీ నుంచి ఏదైనా కొత్త ప్రాడక్ట్ వస్తుందంటే చాలు.. మార్కెట్లో అంది సంచలనమే అవుతుంది. లేటెస్ట్ ట్రెండ్‌కి తగినట్లు యూత్ తోపాటు అన్నికోరుకునే అద్భుతమైన ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ లవర్లను అట్రాక్ట్ చేస్తోంది యాపిల్ కంపెనీ.. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లను ఆపిల్ మంగళవారం రాత్రి కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ లో ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు కంపెనీ అత్యాధునిక A17 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. అవి యాపిల్ వాచ్ అల్ట్రాలో కనిపించేలా ఉండే ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌తో అమర్చబడి ఉంటాయి. iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడల్‌లు గత మోడళ్లలో కాకుండాUSB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉన్నాయి. టాప్-ఆఫ్-లైన్ మోడల్ మెరుగైన జూమ్ పనితీరు కోసం పెరిస్కోప్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ధరలు ఇలా..
కొత్త ఐఫోన్ 15 ప్రో ధర ప్రారంభ ధర 128GB బేస్ వేరియంట్ రూ.1,34,900.
i Phone 15 Pro Max 256GB బేస్ వేరియంట్ ధర రూ.1,59,900. ఈ హ్యాండ్‌సెట్‌లు 256GB, తోపాటు 512GB ,1TB స్టోరేజ్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి.
ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 15 నుండి ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 22 నుండి అమ్మకానికి వస్తాయి. iPhone 15 Pro, iPhone 15 Pro Max బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయని Apple తెలిపింది.
iPhone 15, iPhone 15 Plus స్పెసిఫికేషన్‌లు
iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడళ్లు వరుసగా 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేలు కలిగి ఉంటాయి. Apple సిరామిక్ షీల్డ్ మెటీరియల్‌తో 2,000 nits వరకు బ్రైట్ నెస్ అందిస్తాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. అవి Apple కొత్త 3nm చిప్‌సెట్ A17 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తాయి. ఇవి మిగతా ఫోన్లతో పోల్చితే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని అందిస్తూ పనితీరులో 10 శాతం అధికంగా ఉంటాయి.
హ్యాండ్‌సెట్‌లు దృఢత్వం, తేలికగా ఉండేందుకుగ్రేడ్ 5 టైటానియం, అల్యూమినియం సబ్ స్ట్రక్చర్ ఉపయోగించి తయారు చేశారు.
ఈ హ్యాండ్‌సెట్‌లు 48-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను f/1.78 ఎపర్చర్‌తో కలిగి ఉంటాయి. f/2.2 ఎపర్చర్‌తో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో 12-మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. అయితే ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్ 12-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా సెటప్‌తో f/2.8 ఎపర్చర్‌తో 5x ఆప్టికల్ జూమ్ కలిగి ఉంటుంది.
ఐఫోన్ 15 సిరీస్‌లోని ప్రో మోడల్‌లు 12-మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాతో f/1.9 ఎపర్చరుతో ఉంటాయి. దీన్ని సెల్ఫీలు, వీడియో కాల్‌లు చేయడానికి ఉపయోగించవచ్చు.
సాధారణ మోడల్‌ల మాదిరిగానే, కొత్త iPhone 15 Pr,o iPhone 15 Pro Max USB టైప్-C పోర్ట్‌ను USB 3.0 వేగంతో కలిగి ఉంటాయి. ఈ కేబుల్‌తో గరిష్టంగా 10 Gbps డేటాను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. Apple ప్రకారం, iPhone 15 Pro ఒక ఫుడ్ డే బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. అయితే iPhone 15 Pro Max మరింత ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని పేర్కొంది. మరోవైపు ఇవి వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ ను కూడా కలిగి ఉన్నాయి.