Industrial Smart Cities | దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు, 40 లక్షల ఉద్యోగాలకు అవకాశం
Industrial Smart Cities | దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 28,602 కోట్ల అంచనా వ్యయంతో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రూ. 1.52 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 9.39 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.
12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు..
Industrial Smart Cities : అమృత్‌సర్-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై, వైజాగ్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగ్‌పూర్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లతో సహా ఆరు పారిశ్రామిక కారిడార్లలో ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. . ఈ ఇండస్ట్రియల్ ఏరియాలు ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కాడ్, యూపీలోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, బీహార్‌లోని గయా, తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్ – కొప్పర్తి, జోధ్‌పూర్-పాలిలో ఈ పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
6,456 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 296 కిలోమీటర్ల పొడవున్న మూడు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులు రైలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి. ప్రత్యేకించి ఒడిశాలోని నువాపాడా, జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ వంటి జిల్లాలలో దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ విస్తరణ
2020లో రూ.1 లక్ష కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించిన అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను విస్తరించనున్నట్లు కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ప్యాక్ హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీ, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి పంటకోత అనంతర వ్యవసాయ మౌలిక సదుపాయాలకు ఈ నిధులు కేటాయించనున్నారు. విస్తరణలో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సెకండరీ ప్రాసెసింగ్, PM-కుసుమ్ స్కీమ్ కాంపోనెంట్ A కవరేజీ, ఈ ప్రాజెక్ట్‌లకు క్రెడిట్ గ్యారెంటీలను అందిస్తుంది. ఈ చొరవ రైతులకు వారి ఉత్పత్తులకు విలువను జోడించడంలోపాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఊతమిస్తుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..