Telangana

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. 45 మందికి కొత్త పోస్టింగ్స్! – IAS Transfers List

Spread the love

IAS Transfers List 2026 : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు సీనియర్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నారు.

కీలక శాఖల మార్పులు:

రాష్ట్రస్థాయిలో కీలకమైన ఐటీ, పంచాయతీ రాజ్, సాగునీటి శాఖలకు కొత్త అధికారులను నియమించారు:

సంజయ్ కుమార్: ఐటీ, వాణిజ్య శాఖ నుంచి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (PR&RD) మరియు గ్రామీణ జల సరఫరా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఎన్. శ్రీధర్: ఐటీ మరియు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఈయనకు గనులు, భూగర్భ శాఖ బాధ్యతలను అదనంగా కేటాయించారు. ఎం. దాన కిశోర్: రెవెన్యూ శాఖతో పాటు విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాహుల్ బొజ్జా: రాజకీయ వ్యవహారాల (Political) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ. శ్రీధర్: సాగునీటి మరియు CAD శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. డా. గౌరవ్ ఉప్పల్: ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఈయనకు మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

క్రమ సంఖ్యఅధికారి పేరుకొత్త బాధ్యతలు / పోస్టింగ్
1సంజయ్ కుమార్PR&RD, RWS & RSAD శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
2సబ్యసాచి ఘోష్ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ స్కీమ్స్ మరియు CSR ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
3ఎం. దాన కిశోర్విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (FAC) & రెవెన్యూ శాఖ
4ఎన్. శ్రీధర్ఐటీ & పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి
5రాహుల్ బొజ్జాపొలిటికల్ శాఖ ప్రధాన కార్యదర్శి
6ఈ. శ్రీధర్సాగునీటి & CAD శాఖ కార్యదర్శి
7డా. గౌరవ్ ఉప్పల్ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ కార్యదర్శి
8బి. విజయేంద్రTGSWREIS కార్యదర్శి & ఎస్సీ అభివృద్ధి కమిషనర్
9డి. దివ్యప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి (FAC)
10అద్వైత్ కుమార్ సింగ్తెలంగాణ భవన్ (న్యూఢిల్లీ) సమన్వయ ప్రత్యేక కార్యదర్శి
11ఎం. హనుమంతరావుఎండోమెంట్స్ డైరెక్టర్
12సిక్తా పట్నాయక్ఫైనాన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి
13సందీప్ కుమార్ ఝాజనగాం జిల్లా కలెక్టర్
14ఎం.డి. ముషర్రఫ్ అలీ ఫారూఖీ3వ డిస్కమ్ CMD
15పమెలా సత్పతిలేబర్ శాఖ ప్రత్యేక కమిషనర్
16అనురాగ్ జయంతియాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్
17రాహుల్ రాజ్ పి.ఎస్కోఆపరేషన్ ప్రత్యేక కమిషనర్ & రిజిస్ట్రార్
18భవేష్ మిశ్రాITE&C శాఖ ప్రత్యేక కార్యదర్శి
19జితేష్ వి. పాటిల్TGSPDCL CMD
20రిజ్వాన్‌బాషా షేక్జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్
21సంతోష్ బి.ఎంట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్
22ప్రతీక్ జైన్నారాయణపేట జిల్లా కలెక్టర్
23స్నేహ శబరిష్మహబూబాబాద్ జిల్లా కలెక్టర్
24పి. కాత్యాయిని దేవిస్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ MD
25జి. ఫణీంద్ర రెడ్డినారాయణపేట అదనపు కలెక్టర్
26చిత్ర మిశ్రాకరీంనగర్ జిల్లా కలెక్టర్
27గరీమా అగర్వాల్రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్
28దీపక్ తివారీవికారాబాద్ జిల్లా కలెక్టర్
29ప్రతిమా సింగ్మెదక్ జిల్లా కలెక్టర్
30అంకిత్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్
31చాహత్ బాజ్‌పాయ్హనుమకొండ జిల్లా కలెక్టర్
32ఖుష్బూ గుప్తామహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్
33మందా మకరందుGHMC రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్
34ఫైజాన్ అహ్మద్మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్
35శివేంద్ర ప్రతాప్హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ MD
36పర్మార్ పింకేష్‌కుమార్GHMC కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్
37ఉమా శంకర్ ప్రసాద్వికారాబాద్ అదనపు కలెక్టర్
38జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్
39పి. చంద్రయ్యమంచిర్యాల అదనపు కలెక్టర్
40వై.వి. గణేష్వరంగల్ అదనపు కలెక్టర్
41అబ్దుల్ హమీద్సిద్ధిపేట అదనపు కలెక్టర్
42బి. వెంకటేశ్వర్లునిర్మల్ అదనపు కలెక్టర్
43ఎన్. ఖీమ్యా నాయక్వనపర్తి అదనపు కలెక్టర్
44కె. విద్యాసాగర్Industry & Investment Cell & SPEED అదనపు CEO
45ఎం. సురేందర్ప్రజావాణి అదనపు నోడల్ అధికారి

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *