Hyderabad-Karnool highway | హైదరాబాద్ - కర్నూల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై బిగ్ అప్‌డేట్
Hyderabad-Karnool highway | హైదరాబాద్ నుంచి కర్నూల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కు సంబంధంచి ఐదు వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని తెలిపారు. దీరిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినట్లు తెలిపారు. ఈ రోడ్డు (Hyderabad-Karnool highway ) నిర్మాణంతో రెండు తెలుగురాష్ట్రాల ప్రజలకు రవాణా మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పర్యటనకు మంత్రి కోమటిరెడ్డి వచ్చారు. ఈసందర్భంగా 44వ జాతీయ రహదారి వద్ద స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వాగతం పలికారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు మొదలు పెట్టారని మంత్రులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. కాగా డీఎస్సీ ఉద్యోగ నియామకాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే చేపట్టనున్నారని పేర్కొన్నారు.
త్వరలో చటాన్ పల్లి ఆర్వోబి నిర్మాణ పనులు
రూ. 190 కోట్లతో చటాన్ పల్లి ఆర్‌ఓబి బ్రిడి నిర్మాణ పనులను 15 రోజుల్లో ప్రారంభించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రూ.190 కోట్లతో చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో రూ.90 కోట్లతో నిర్మాణం చేసేందుకు సిద్ధం చేశారని..అయితే స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని రూ.190 కోట్లు మంజూరు చేసి మరో 15 రోజుల్లో పూర్తి స్థాయిలో వైద్య జంక్షన్ తరహాలో రైల్వే వోట్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని తెలిపారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..