Saturday, April 19Welcome to Vandebhaarath

మీ ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకోండి

Spread the love

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు మ‌ట్టితో త‌యారు చేసిన వినాయ‌కుల విగ్ర‌హాల‌(eco-friendly-ganesha)ను వినియోగించాలి. మీకు అందుబాటులో మట్టి విగ్రహాలు అమ్మకానికి లేకుంటే  మీ ఇంట్లోనే మీరే స్వయంగా మ‌ట్టితో చక్కని గణపతి ప్రతిమను త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే పర్యావరణ ప్రేమికులు మ‌ట్టి విగ్ర‌హాల‌ను చాలా చోట్ల ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ విగ్ర‌హాలు లభించనివారు  బాధపడాల్సిన అవ‌స‌రం లేదు. ఎందు కంటే కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తూ మీ ఇంట్లోనే మీరు కూడా మ‌ట్టితో వినాయ‌కుడి విగ్ర‌హాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రి ఆ విగ్ర‌హం తయారీ గురించి తెలుసుకుందామా.. !

మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు
మట్టి, నీరు, రంగుల కోసం ప‌సుపు, కుంకుమ‌

మొదటి దశ:

READ MORE  Railway News | పర్వతాల మధ్య రైలు కూతలు.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు కనెక్టివిటీ త్వరలో ప్రారంభం..

మీకు అందుబాటులో ఉండే ఏదైనా తోట మట్టిని తీసుకోండి. అది పూర్తిగా ఆరనివ్వండి. అందులో రాళ్లను తొలగించండి. ఈ పొడి మట్టిని జల్లెడ పట్టండి. చిన్నచిన్న కంకర, చిన్న రాళ్ల నుంచి సన్నని మట్టిని వేరు చేయండి.

రెండో దశ:

ఒక కంటైనర్‌లో ఈ సన్నని మట్టికి నీరు పోసి, డీకాంటేషన్ కోసం పక్కన పెట్టండి. అంటే.. మట్టి  కంటైనర్ అడుగు భాగంలో స్థిరపడిన తర్వాత, పైభాగంలో దుమ్ము, నీరు వేరు చేయబడతాయి. ఇప్పుడు కంటైనర్ నుండి నీటిని తొలగించండి.

READ MORE  Israel Palestine conflict: ఇజ్రాయెల్ ఎలా పుట్టింది..? పాలస్తీనాతో వివాదం ఎందుకు? యూదుల వలస వెనుక చరిత్ర ఏమిటీ?

ఈ మట్టిని చక్కటి కాటన్ గుడ్డలోకి తీసుకుని, దానిని గట్టిగా కట్టి , రాత్రిపూట వేలాడదీయండి ఇలా చేయడం ద్వారా మట్టిలో ఉన్న  అధిక తేమను తొలగించవచ్చు.

మూడో దశ :

మట్టి సిద్ధంగా ఉంది!!

మీరు తయారు చేయాలనుకుంటున్న గణేష్ విగ్రహాన్ని నిర్ణయించుకోండి.

శరీరానికి పెద్ద మట్టి ముద్దను, తల కోసం చిన్న మట్టి ముద్దను తీసుకోండి.
పెద్ద భాగాన్ని బేస్ మీద ఉంచండి. దానిని శరీర నిర్మాణంలో ఆకారాన్ని తయారు చేయండి.
ఇక తొండాన్ని తయారు చేసి తల భాగం నుంచి శరీరంపైకి వచ్చేటట్లు అతికించండి.
ఇప్పుడు చేతులు, కాళ్లు, చెవులకు కూడా చిన్న మట్టి ముద్దలను తీసుకోండి
అవయవాలను తయారు చేయడానికి మీ చేతుల మధ్య మట్టిని రోల్ చేయండి. వాటిని శరీరానికి  అతికించండి
చివరగా, చెవులను జోడించండి.. ఇప్పుడు విగ్రహం సిద్ధంగా ఉంది. మీరు కోరుకున్నట్లుగా కళ్ల కోసం విత్తనాలు అతికించండి.

READ MORE  అయోధ్య లో సొంతిల్లు కావాల‌నుకునేవారికి సువ‌ర్ణావ‌కావం.. రామాల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే 'వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌

పసుపు, కుంకుమతోపాటు  ఇతర సహజ రంగులతో  మీరు కోరుకున్న విధంగా విగ్రహాన్ని అలంకరించండి..


Ganapati Idol Making Mould

అచ్చుల ద్వారా కూడా చక్కని వినాయక విగ్రహాలను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విగ్రహాల అచ్చులు అమేజన్ , ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల్లో తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ అచ్చుల ద్వారా మన ఇంటి కోసమే కాకుండా పెద్ద మొత్తంలో విగ్రహాలను తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. మీకు అన్ లైన్ లో వినాయక విగ్రహాల మౌల్డ్స్ కావాలనుకుండే కింది లింక్ లను క్లిక్ చేయండి..


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *