TS TET 2024 : నేటి నుంచే ‘టెట్’ దరఖాస్తులు.. అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోండి..
TS TET 2024 Updates: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత (TS TET 2024) పరీక్ష దరఖాస్తులు బుధవారం నుంచి ప్రారంభమైంది. విద్యాశాఖ ఇప్పటికే పరీక్ష షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. దీని ప్రకారం… మార్చి 27 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు. . https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు కూడా జారీ చేయనున్నారు. మే 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై జూన్ 6వ తేదీ వరకు ముగుస్తాయి. ఇక టెట్ (TS TET Results 2024)ఫలితాలు జూన్ 12న విడుదల చేయనున్నారు.
టీఎస్ టెట్ ముఖ్య తేదీలు
- తెలంగాణ టెట్ నోటిఫికేషన్ : 04, మార్చి, 2024.
- దరఖాస్తులు ప్రారంభం : మార్చి 27, 2024.
- దరఖాస్తులు సమర్పించేదుకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2024.
- హాల్ టికెట్లు : మే 15, 2024.
- పరీక్షల ప్రారంభం : మే 20, 2024.
- పరీక్షల ముగింపు : జూన్ 06,2024.
- టెట్ ఫలితాలు : జూన్ 12, 2024.
- అధికారిక వెబ్ సైట్ : https://schooledu.telangana.gov.in/ISMS /
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
- How to Apply TS TET 2024 : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసే అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు మొదట https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి.
- మొదటి వెబ్ పేజీలో ‘Fee Payment’ అనే ఆప్షన్ ను ఎంచుకొని నిర్ణీత ఫీజును చెల్లించాలి.
- పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై క్లిక్ చేసి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది నిర్ధారించుకోవాలి.
- ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- మీ విద్యార్హతల వివరాలను ఎంటర్ చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలి.
- అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత చివరన ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే.. అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
- అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోవడానికి ‘Print Application’ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. తర్వాత హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.
TS TET 2024 సిలబస్ ను ఇలా పొందండి..
TS TET Syllabus Download: టెట్ కు సన్నద్ధమయ్యేవారు. సిలబస్ గురించి ఎలాంటి ఆందోళన పెట్టుకోనవసరం లేదు.
- అభ్యర్థులు తమకు కావలసిన సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్‌కోసం https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోను సందర్శించాలి.
- హోంపేజీ లో * Syllabus * అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి..
- ఇక్కడ మీ సబ్జెక్టుల వారీగా లిస్ట్ కనిపిస్తుంది. ఆ పక్కనే డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు రాసే సబ్జెక్ట్ కు సంబంధించిన
- సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ చేసుకున్న కాపీని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..