Hindu Devotees Attacked by Khalistani Extremists in Canada Temple | టొరంటో : కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ భక్తుల (Hindu devotees)పై ఖలిస్తానీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ హిందూ మందిం వెలుపల భక్తులపై కర్రలతో ప్రజలను కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు.
ఈ ఘటన తరువాత, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో హిందూ సభ ఆలయంపై దాడిని ఖండించారు, ప్రతి పౌరుడు తమ విశ్వాసాన్ని “స్వేచ్ఛగా, సురక్షితంగా” ఆచరించే హక్కును కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. “ఈరోజు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్ (Hindu Sabha Temple) లో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది” అని ట్రూడో ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. “సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వేగంగా స్పందించినందుకు పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
హిందూ భక్తులపై దాడి ఘటనను కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఖండించారు. “ఈ రోజు కెనడియన్ ఖలిస్తానీ తీవ్రవాదులు రెడ్ లైన్ ను దాటారు. బ్రాంప్టన్‌లోని హిందూ సభా ఆలయ ప్రాంగణంలో హిందూ-కెనడియన్ భక్తులపై ఖలిస్తానీలు చేసిన దాడి ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం ఎంత ప్రమాదకరంగా ఉందో స్పష్టం చేస్తుందని అన్నారు కెనడియన్ ప్రతిపక్ష నాయకుడు పియరీ పొయిలీవ్రే కూడా ఈ దాడిని ఖండించారు, “ఈరోజు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌లో భక్తులపై హింస ఆమోదయోగ్యం కాదని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు