Himachal Pradesh | సిమ్లాలో భారీ నిరసన.. అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని సింజౌలి మసీదు (Mosque) అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ.. హిందూ సంస్థలు, బిజెపి కార్యకర్తలు, స్థానికులు గురువారం నిరసన తెలిపారు. నివేదికల ప్రకారం, సంజౌలిలోని మార్కెట్ పక్కనే ఉన్న మసీదు చట్టవిరుద్ధంగా నిర్మించారని అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని నినాదాలు చేశారు. పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు.
రాష్ట్రంలో మసీదు నాలుగు అంతస్తులుగా ఉండగా, కేవలం రెండున్నర అంతస్తుల భవన నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉందని నిరసనకారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోనవసరం లేదని సీఎం సుక్కు అన్నారు.
వలసదారులపై ఆందోళనలు
ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ లో ఇతర దేశాల నుంచి వలసదారులు వస్తున్నట్లు గుర్తించామని రాష్ట్ర మంత్రి అనిరుద్ధ్ సింగ్ తెలిపారు. వలసలపై సమగ్ర దర్యాప్తు అవసరమని సూచించారు. ఈ ప్రాంతం భద్రత కోసం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. “హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడుతుంది, ప్రతి చర్య చట్టబద్ధంగా ఉండేలా చూస్తుంది. ఇది దేవాలయం లేదా మసీదు సమస్య కాదు, చట్టబద్ధమైన, అక్రమ నిర్మాణాలకు సంబంధించినది” అని సింగ్ అన్నారు.
అంతేకాకుండా, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ, మసీదు ‘చట్టవిరుద్ధం’ అయితే చర్యలు తీసుకుంటామని అన్నారు. విక్రమాదిత్య సింగ్ కూడా వలసదారుల సమస్యను లేవనెత్తారు. ఇది “హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఆందోళన కలిగించే విషయం” అని పేర్కొన్నారు.
అక్రమ మసీదుకు సంబంధించి తదుపరి చర్య మునిసిపల్ కమీషనర్ కోర్టులో నిర్ణయించబడుతుంది. ఈ కేసుపై సెప్టెంబర్ 7న విచారణ జరగనుంది. మసీదును కూల్చాలా వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అని అన్నారు. విక్రమాదిత్య మాట్లాడుతూ, “చాలా కాలంగా, సంజౌలిలో మసీదు నిర్మించే అంశం ఊపందుకుంది. నిర్మాణ అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయం సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పరిధిలో ఉన్నందున, ఇది పరిశీలనలో ఉంది. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది, ఇది చట్టవిరుద్ధమైతే, దానిపై చర్యలు తీసుకుంటారు అని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..