రోడ్డు భద్రతపై అవగాహన కోసం కూతురు పెళ్లిలో హెల్మెట్‌లు పంపిణీ చేసిన తండ్రి
Helmets distribution wedding | కోర్బా : ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఓ వ్యక్తి తన కుమార్తె వివాహవేడుకల్లో రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్‌లను పంపిణీ చేశాడు. కోర్బా నగరంలోని ముదాపర్ ప్రాంతానికి చెందిన సెడ్ యాదవ్ అనే వ్యక్తి తన కుమార్తె నీలిమ వివాహాన్ని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అవకాశంగా తీసుకుని హెల్మెట్ ధరించి డ్యాన్స్ చేశాడు.
స్పోర్ట్స్ టీచర్ నీలిమ, సరన్‌గఢ్-బిలాయిగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హన్ యాదవ్‌ను పెళ్లి చేసుకుంది. మోటారు సైకిళ్లపై వివాహ వేదిక వద్దకు చేరుకున్న అతిథులకు సెడ్ యాదవ్ రిటర్న్ గిఫ్ట్‌గా హెల్మెట్‌లను అందజేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సందర్భంగా యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. “రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి నా కుమార్తె పెళ్లి ఉత్తమ సందర్భమని నేను భావించాను. నేను అతిథులకు జీవితం ఎంతో విలువైనదని చెప్పాను. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నేను వారికి విజ్ఞప్తి చేశాను. తాగి వాహనం నడపడం చేయొద్దని చెప్పినట్లు తెలిపారు. ఈ వివాహ వేడుకల్లో తన కుటుంబానికి చెందిన పన్నెండు మంది సభ్యులు కూడా వివాహ సమయంలో హెల్మెట్ ధరించి డ్యాన్స్ చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..