Saturday, August 30Thank you for visiting

నుహ్ లో నేడు వీహెచ్ పీ శోభాయాత్ర : అనుక్షణం టెన్షన్.. టెన్షన్.. భారీ భద్రత, ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్ అమలు..

Spread the love

Nuh Shobha Yatra : హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ సోమవారం ‘శోభా యాత్ర’ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యలో స్థానిక యంత్రాంగం భద్రతా బలగాలను భారీ ఎత్తున మోహరించింది. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా కఠినమైన చర్యలను తీసుకుంటోంది.

పోలీసు అనుమతి నిరాకరించినప్పటికీ, విశ్వహిందూ పరిషత్ (VHP) ఊరేగింపును నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నందున పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సెక్షన్ 144 విధించింది. నుహ్ జిల్లాలో ఎక్కడా గుమిగూడొద్దని ప్రజలను కోరింది.

సెక్షన్ 144 విధింపు

నుహ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అశ్విని కుమార్, జిల్లాలో సెక్షన్ 144 విధించినట్లు ప్రకటించారు. శోభాయాత్రకు దూరంగా ఉండాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, బ్యాంకులను మూసి వేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. యాత్రను ప్రచారం చేసేవారు సెక్షన్ 144ను ఉల్లంఘిస్తే శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భారీగా పోలీసుల మోహరింపు

నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత, విస్తృతమైన భద్రతా ఏర్పాట్లను వివరించారు. 13 పారామిలిటరీ కంపెనీలు, మూడు హర్యానా ఆర్మ్‌డ్ పోలీస్ (హెచ్‌ఏపీ) కంపెనీలు, 657 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సెక్షన్ 144 అమలులో ఉంది. ఈవెంట్ రోజున ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని, సెక్షన్ 144ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

హర్యానా పోలీసులు జిల్లా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. మాన్యువల్ తనిఖీలతో పాటు నిఘా కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉండగా, బ్రజ్ మండల్ శోభా యాత్ర శాంతియుతంగా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కొనసాగుతుందని వీహెచ్‌పీ నేత అలోక్ కుమార్ తెలిపారు.

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *