Gold and silver rates today : స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధర.. నేటి లెక్కలివే!
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ. 54,650 వద్ద కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ.5,46,500 కి చేరింది. ఒక గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.5,465 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం..
ఇక 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర సైతం స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఈ ధర రూ.59,620 గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ.5,96,200గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,962గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,760గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 59,620గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,950గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,950గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,650గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,620గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,620గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
వెండి ధరలు ఇలా..
దేశంలో వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,280గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 దిగొచ్చి రూ. 72,800గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 73,000గా ఉండేది.
ధరల్లో మార్పులు ఎందుకు?
బంగారం, వెండి, ప్లాటినం వంటి అలంకరణకు సంబంధించిన లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాలపై ఈ ధరల మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్స్ లో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ఈ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.