విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి

 విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి

నాగ్ పూర్ లో అత్యవసర ల్యాండింగ్

ముంబై నుంచి రాంచీ కి వెళ్తున్న  ఇండిగో ( Indigo) విమానంలో ఓ ప్రయాణికుడికి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని నాగ్ పూర్ లో అత్యవసరంగా నిలిపివేశారు.
ముంబై-రాంచీ ఇండిగో ఎయిర్‌లైన్ విమానం సోమవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీకి గురికావడంతో వెంటనే విమానాన్నిల్యాండ్ చేసినట్లు అధికారి తెలిపారు. 62 ఏళ్ల ప్రయాణికుడు డి.తివారీని హుటాహుటిన ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు అయితే. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ప్రయాణికుడు CKD (Chronic kidney disease), క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. అతడు విమానంలో రక్తపు వాంతులు చేసుకున్నట్లు నాగ్‌పూర్‌లోని KIMS హాస్పిటల్ బ్రాండింగ్, కమ్యూనికేషన్స్ DGM ఏజాజ్ షమీ తెలిపారు. అతని మృతదేహాన్ని తదుపరి ప్రక్రియల కోసం ప్రభుత్వ వైద్య ఆసుపత్రికి తరలించారు” అని షమీ ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. పైలట్ ఇన్ కమాండ్ నాగ్‌పూర్‌ (Nagpur) లో ల్యాండ్ చేయడానికి కాల్ చేశాడు.
ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో, “ముంబై నుండి రాంచీకి నడిచే ఇండిగో ఫ్లైట్ 6E 5093, విమానంలో వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా నాగ్‌పూర్‌కు మళ్లించబడింది. ప్రయాణికుడిని ఆఫ్‌లోడ్ చేసి తదుపరి వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడలేదు. ” అని తెలిపారు.

READ MORE  ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..

మరో ఘటనలో ఇండిగో పైలట్ మృతి

ఇండిగో పైలట్ నాగ్‌పూర్ విమానాశ్రయంలో గత గురువారం ఓ పైలట్ అనారోగ్యంతో మృతిచెందాడు. విమానాశ్రయంలోని బోర్డింగ్ గేట్ వద్ద కెప్టెన్ మనోజ్ సుబ్రమణ్యం (40) అతను విమానాన్ని నడపడానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళుతుండగానే మృతిచెందాడు. కెప్టెన్ మనోజ్ సుబ్రమణ్యం గత వారం గురువారం మధ్యాహ్నం 1 గంటలకు నాగ్‌పూర్-పూణె 6E135 విమానాన్ని నడపాల్సి ఉంది, అయితే అతను మధ్యాహ్నం 12.05 గంటలకు కుప్పకూలిపోయాడు. ప్రాథమిక నివేదికల ప్రకారం, పైలట్ “సడెన్ కార్డియాక్ అరెస్ట్” కారణంగా మరణించాడని అధికారులు తెలిపారు.

READ MORE  water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అబిద్ రూహి మాట్లాడుతూ పైలట్ కుప్పకూలిన తర్వాత పైలట్‌కి అత్యవసర బృందం CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్)నుఅందించిందని, అయితే అతను స్పందించలేదని, ఆస్పత్రికి తరలిస్తుండగానే అతను చనిపోయినట్లు ప్రకటించారు.


Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

READ MORE  Karnataka | కర్నాటకలో దారుణ ఘటన.. మొసళ్లతో నిండిన కాలువలోకి కన్న కొడుకును తోసేసిన తల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *