1.43-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Phoenix స్మార్ట్‌వాచ్
Fire-Boltt కంపెనీ తాజాగా సరాసమైన ధరలో Phoenix AMOLED స్మార్ట్‌వాచ్ ను విడుదల చేసింది.. ఇది 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది ఇది 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటర్, SpO2 లెవల్స్ మానిటర్ వంటి ఫీచర్లు ఉంటాయి. కొత్త Fire-Boltt Phoenix AMOLED కూడా 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇది తిరిగే డయల్ రౌండ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో ఇన్‌బిల్ట్ గేమ్‌లతో పాటు స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి.
Fire-Boltt Phoenix AMOLED ధర
Fire-Boltt Phoenix AMOLED Smart Watch భారతదేశంలో రూ. 2,199 ధరకు లాంచ్ అయింది. ఈ ప్రస్తుతం స్మార్ట్ వాచ్ ఫైర్-బోల్ట్ వెబ్‌సైట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది బ్లాక్, గోల్డ్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ వాచ్ స్పెసిఫికేషన్లు
కొత్త Fire-Boltt Phoenix AMOLED స్మార్ట్‌వాచ్ 1.43-అంగుళాల (466×466 పిక్సెల్‌లు) HD డిస్‌ప్లేతో 700 nits బ్రైట్ నెస్ తో రౌండ్ డయల్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌తో వస్తుంది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌కి లింక్ చేసినప్పుడు వాచ్ నుండి నేరుగా ఫోన్ కాల్‌లు చేయడానికి అలాగే స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది. స్మార్ట్ వాచ్‌లో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉన్నాయి.
Fire-Boltt తాజా వాచ్ లో SpO2 మనిటర్ప, హృదయ స్పందన పర్యవేక్షణ, ఉమెన్ హెల్త్ ట్రాకర్, స్లీప్ ట్రాకింగ్ వంటి స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌లు ఉన్నాయి. అదనంగా, Fire-Boltt Phoenix AMOLED 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌ల కోసం ట్రాకింగ్‌కు కూడా సపోర్ట్ఇ స్తుంది. స్మార్ట్ వాచ్ ఎంచుకోవడానికి అనేక కాస్టోమైస్డ్ వాచ్ ఫేసస్ కలిగి ఉంది. ఇంకా, ఇది సిరి, OK Google వాయిస్ అసిస్టెంట్ తో కూడా వస్తుంది.
Fire-Boltt Phoenix AMOLED బలమైన బ్యాటరీ లైఫ్అం దిస్తుంది.. ఇంకా ఈ భారతీయ బ్రాండ్ స్మార్ట్ వాచ్ కి కనెక్ట్ చేయబడిన స్మార్ట్‌ఫోన్ నుండి కాల్‌లు మెసేజ్ లు కోసం నోటిఫికేషన్స్ అందిస్తుంది.. రిమోట్ కెమెరా కంట్రోల్స్, వాతావరణం, అలారం, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.