Special Trains | పండుగ వేళ గుడ్ న్యూస్.. మహబూబ్‌నగర్ – గోరక్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గోరక్‌పూర్ – మహబూబ్‌నగర్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌లోనూ నడిపిస్తున్నట్లు పేర్కొంది. గోరక్‌పూర్ – మహబూబ్‌నగర్ (05303) మధ్య అక్టోబర్ 12, 19, 26 మధ్య ప్రతీ శనివారం స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది.
ఇక మహబూబ్‌నగర్ – గోరక్‌పూర్ (05304) మధ్య మీదుగా అక్టోబర్ 13, 20, 27వ తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రైలు జడ్చర్ల, షాద్‌నగర్, ఉమ్దానగర్, కాచిగూడ, మల్కాజ్‌గిరి, రామగుండం, బెల్లంపల్లి, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, ఒరై, కాన్పూర్ సెంట్రల్, ఐష్‌బాగ్, బస్తీ స్టేషన్ల మీదుగా గోరక్‌పూర్‌కు రైలు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
అక్టోబర్ 21 నుంచి అందుబాటులోకి..
దసరా, దీపావళి, ఛత్ పండుగలను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 48ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు అధికారులు తెలిపారు. అక్టోబరు 21 నుంచి నవంబరు 13వరకు స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
- నాందేడ్-పన్వేల్ మధ్య 24 సర్వీసులు,
- కొచువెల్లి-నిజాముద్దీన్ మధ్య 16 సర్వీసులు
- పుణె-కరీంనగర్ మధ్య 8 సర్వీసులు
అలాగే గోరఖ్‌పూర్-మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక సర్వీసులు పొడిగించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 21, 22 తేదీల్లో సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..