Free Train : ఫ్రీ గా రైలు ప్రయాణం , రూపాయి కట్టక్కరలేదు.
Free Train Fecility | రాజకీయ నేతలంతా ఇప్పుడు అధికారం కోసం మహిళలకు ఫ్రీ బస్సు అని ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో మొదలైన మహిళలకు ఈ ఫ్రీ అస్ ఫెసిలిటీ తెలంగాణాలో కూడా మొదలైంది. త్వరలోనే ఏపీ లో కూడా మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో బస్సు ప్రయాణం అనరికీ ఉచితంగా అందిస్తారు. అక్కడ మగ, ఆడవారు అన్న తేడా లేకుండా అందరికీ ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఐతే ఫ్రీ బస్సు గురించి విన్నాం కానీ ఎప్పుడైనా ఫ్రీ ట్రైన్ గురించి విన్నారా..? అందులో ఎప్పుడైనా ప్రయాణించారా..?
ఏంటి ఫ్రీ ట్రైన్.. అది కూడా మన దగ్గర అని ఆశ్చర్యపోవచ్చు. భారతీయ రైలు ఫ్రీ బస్ ఫెసిలిటీని కూడా అందిస్తుంది. ఐతే అది కేవలం భాక్రా టు నంగల్ ప్రయాణీకులకు మాత్రమే అందిస్తుంది. టికెట్ లేకుండా ఫ్రీ ట్రైన్ ఎక్కాలని ఉందా అయితే మీరు భాక్రా రైల్వే స్టేషన్ కు ఎళ్లి భాక్రా టు నంగల్ ట్రైన్ ఎక్కితే మీరు టికెట్ లేకుండానే ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది.
భాక్రా రైల్వేస్టేషన్ ప్రయాణీకుల కోసం ఈ అవకాశాన్ని అందిస్తుంది. దాదాపు గత 73 ఏళ్లుగా ఈ మార్గంలో ప్రయాణీకులు టికెట్ లేకుండా ఫ్రీగానే ట్రైన్ జర్నీ ( Free Train Journey ) చేస్తున్నారు. భాక్రా టు నంగల్ రైలుగా పిలిచే ఈ ట్రైన్ హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ సరిహద్ధు ప్రంతాల వరకు వెళ్తుంది. ముఖ్యంగా భాక్రా నుంచి నంగల్ మధ్య ప్రయాణించే ప్రయాణీకులు టికెట్ లేకుండానే ఉంచితంగా ఈ ట్రైన్ లో వెళ్లవచ్చు.
ప్రత్యేకంగా కోచ్ లు..
ఈ రైలు కోచ్ లు చెక్కతో తయారు చేశారు. ఈ ట్రైన్లో మొత్తం 3 బోగీలు ఉంటే.. వాటిలో రెండు టూరిస్టులకు, ఒకటి మహిళల కోసం ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ డీజిల్ ఇంజిన్ అవ్వడంతో 50 లీటల డీజిల్ తో 13 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఎక్కువగా భాక్రా నంగల్ డ్యాం చూసేందుకు ప్రయాణీకులు అక్కడకు వెళ్తుంటారు. దేశంలో అతి పొడవైన డైరెక్ట్ గ్రావిటీ డ్యాం. అందుకే అక్కడకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. ఐతే.. ఈ డ్యాం వెళ్లేందుకు వీలుగా ఈ ఫ్రీ ట్రైన్ ని వాడుకోవచ్చు. ఈ ట్రైన్ సట్లెజ్ నదిపై నడుస్తుంది.. అంతేకాదు ట్రైన్ లో వెళ్లేప్పుడు పెద్ద పర్వాలు కూడా ఉంటాయి. అందుకే టూరిస్ట్ లకు ఈ ట్రైన్ ప్రయాణం మంచి అనుభూతి కలిగిస్తుంది.
భాక్రా ననల్ డ్యాం రైలు సర్వీస్ 1948 లోనే ప్రారంభమైంది. ఇది అప్పట్లో ఆ డ్యాం ఉద్యోగులు, కార్మికులను తీసుకెళ్ల్లడానికి ఏర్పాటు చేశారు. ఐతే కాలక్రమేణా ఇది ప్రయాణీకులకు పర్యాటకులకు కూడా వాడుతున్నారు. 2011 లో ఈ ట్రైన్ ఫ్రీ జర్నీ ని రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దేశంలో మరెక్కడా ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ లేదు ఒక్క భాక్రా నంగం ట్రైన్ మాత్రమే ఈ ఉచిత్ర ట్రైన్ ప్రయాణాన్ని అందిస్తుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..