
Collateral-Free Term Loans Scheme for MSMEs : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) శనివారం తెలిపారు. కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌పై త్వరలో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బెంగళూరులో జరిగిన నేషనల్ MSME క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయం – ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) విజయవంతం అయిన తర్వాత, కొవిడ్ కాలంలో లిక్విడిటీని అందించడం ద్వారా మిలియన్ల కొద్దీ MSMEలు నష్టాల్లోకి కూరుకుపోకుండా కాపాడాయి. ప్రభుత్వం వారి కోసం టర్మ్-లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 2023 నాటికి, ECLGS ₹3.68 లక్షల కోట్లతో 1.19 కోట్ల మంది రుణగ్రహీతలకు లబ్ధి చేకూర్చింది.
MSMEలు సులభమైన వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లను పొందుతున్నప్పటికీ, వారు టర్మ్-లోన్‌లు పొందడంలో సమస్యలను ఎదుర్కొన్నారని సీతారామన్ శనివారం చెప్పారు. ప్రతిపాదిత పథకం 100 కోట్ల వరకు టర్మ్-లోన్ కోసం కొలేటరల్-ఫ్రీ గ్యారెంటీని కవర్ చేస్తుంది. ఒక యూనిట్ బ్యాంకుల నుంచి ఇంకా ఎక్కువ రుణం తీసుకోవచ్చని ఆమె చెప్పారు. “మీకు థర్డ్-పార్టీ గ్యారెంటీ అవసరం లేదని తెలిపారు.
గత బడ్జెట్ ప్రతిపాదనలలో MSME రంగానికి భారీగా నిధులు కేటాయించారు. “ఈ బడ్జెట్ MSMEలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. MSMEలు వృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా పోటీపడేందుకు యువ పారిశ్రామికవేత్తలకు ఫైనాన్సింగ్, సాంకేతిక మద్దతుతో కూడిన ప్యాకేజీని రూపొందించాము,” జూలై 23న తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా అన్నారు.
తయారీ రంగంలో ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రవేశపెడతామని బడ్జెట్ (Budget 2024) ప్రసంగంలో పేర్కొన్నారు. “ఈ పథకం అటువంటి MSMEల క్రెడిట్ రిస్క్‌ల పూలింగ్‌పై పనిచేస్తుంది. విడిగా ఏర్పాటు చేయబడిన సెల్ఫ్-ఫైనాన్సింగ్ గ్యారెంటీ ఫండ్, ప్రతి దరఖాస్తుదారునికి ₹100 కోట్ల వరకు గ్యారెంటీ కవర్‌ను అందిస్తుంది.
గతంలో లోన్‌లను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్రా రుణాల పరిమితిని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఇటీవల తన రెండవ MSME సంబంధిత బడ్జెట్ ప్రతిపాదనను అమలు చేసింది. గతంలో రుణం పొంది.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలు – ‘తరుణ్ ప్లస్’ కింద కొలేటరల్ ఫ్రీ సంస్థాగత క్రెడిట్ గరిష్ట పరిమితిని ₹20 లక్షలకు రెట్టింపు చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.