లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?
రియల్ లెదర్ & సింథటిక్ గుర్తించడానికి క్లూలు తెలుసుకోండి
మనలో చాలా మంది లెదర్ వస్తువులను ఉపయోగించునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే లెదర్ ప్రోడక్స్ కొనేపుడు చాలామంది కస్టమర్లు ఇది నిజమైన లెదరేనా?” లేదా నకిలీదా.. లేదా సింథటికా? అనే ప్రశ్నలు తలెత్తూనే ఉంటాయి. లెదర్ బెల్టులు, బ్యాగులు, చెప్పులు, పర్సులు వంటి లెదర్ వస్తువులను కొనేటపుడు ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది. సింథటిక్ (Synthetic) అనేది ఒరిజినల్ లెదర్ కు ప్రత్యామ్నాయం.. ఈ రెండింటి మధ్య తేడాతెలుసుకోవడం కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి . ఏది ఏమైనప్పటికీ, కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సింథటిక్ లేదా ఒరిజినల్
లెదర్‌ను గుర్తించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి మీ కళ్ళు, ముక్కు, స్పర్శతో గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
క్వాలిటీ లెదర్
లెదర్ నాణ్యతను నిర్ణయించడంలో మొదటి క్లూ కంపెనీ వెబ్‌సైట్. ప్రొడక్ట్ గురించి లేబల్స్ పూర్తిగా చదవండి.. Full-grain leather అత్యంత మన్నికైన, అత్యధిక నాణ్యత
కలిగి ఉంటుంది.
లేబుల్ కింది వాటిలో ఏదైనా చెబితే, అది సింథటిక్ అని అర్థం:
1. Man-made material మానవ నిర్మిత పదార్థం
2. Leatherette
3. Faux leather (ఫాక్స్ లెదర్ )
4. Vegan leather (వేగన్ లెదర్)
5. PU (పీయూ లెదర్ )
6. Pleather (ప్లెదర్)
ప్రొడక్ట్ కవర్, లేదా బాక్స్ పై మెటీరియల్ గురించి ఏమీ చెప్పకపోతే, మళ్ళీ, ఇది బహుశా
PVC లేదా సింథటిక్, పాలిమర్ ఉత్పత్తి అయి ఉండొచ్చు.
అనుమానం వస్తే వాసన చూడండి..
Real natural leather (నిజమైన సహజ తోలు) చాలా విలక్షణమైన వాసనను కలిగి ఉంటుంది – సహజమైన, సేంద్రీయ సువాసన రాదు. మరోవైపు, సింథటిక్ లెదర్
రసాయనాలు లేదా ప్లాస్టిక్ వంటి వాసన కలిగి ఉంటుంది. ఇది కొద్దిగా ప్లాస్టిక్- వాసన లేదా కెమికల్ స్మెల్ వస్తే ఇది కచ్చితంగా సింథటిక్ అని తేల్చేయవచ్చు.
ఉపరితలాన్ని నిశితంగా పరిశీలించండి..
మరొక క్లూ ఫాబ్రిక్. ఫాబ్రిక్ యొక్క రంధ్రాలను నిశితంగా పరిశీలించండి. రియల్ లెదర్ క్రమరహితమైన సహజమైన నిర్మాణం కలిగి ఉంటుంది. మరోవైపు సింథటిక్ తోలు పదార్థంపై రంధ్రాలు క్రమపద్ధతిలో డిజైన్ చేసినట్లు ఉంటాయి. అందువల్ల, ఇది స్థిరమైన, రిపీట్ డిజైన్ ను కలిగి ఉంటుంది.
తడిమి చూడండి
మరొక క్లూ టచ్. రియల్ లెదర్ అనేది రియల్ హైడ్‌తో తయారు చేయబడిన సహజ పదార్థం, ఇది గట్టిగా నొక్కినప్పుడు ముడుతలను ఏర్పరుస్తుంది. సింథటిక్ లెదర్ అలా ఉండదు.
ధర క్లూ:
సాధారణంగా సింథటిక్ లేదా ఫాక్స్ లెదర్ ఐటెమ్ రియల్ లెదర్ ఐటెమ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది.
ఫైర్ టెస్ట్
మీరు ఇంకా పరిశీలించాలనుకుంటే లెదర్ ప్రొడక్ట్ ను ఫైర్ టెస్ట్ కూడా ఎంచుకోవచ్చు.
లెదర్ మెటీరియల్ వెనుక వైపు నుండి కొద్దిగా ఫైబర్ తీసుకోండి, ఆపై దానికి వేడి సెగ తాకించండి. (అగ్గిపెట్టె లేదా లైటర్ ఉపయోగించండి). వాసన చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ అది కరిగిపోతే అది సింథటిక్ అని. కాలిపోయిన వెంట్రుకలు.. కాలిపోయిన వాసన వస్తుంటే అది తోలుగా అర్థం చేసుకోవాలి..
కట్ టెస్ట్
ఇంకా అనుమానం ఉండి లోతుగా పరిశీలించాలనుకుంటే లెదర్ ను కట్ చేసే పరీక్షను ఎంచుకోవచ్చు. మీరు మెటీరియల్‌ను కత్తిరించినట్లయితే, సహజమైన తోలు పీచు అంచుని కలిగి ఉంటుంది. అయితే సింథటిక్ చాలా ఖచ్చితమైన & స్మూత్ గా కట్ చేసిన అంచుని కలిగి ఉంటుంది.