
Chhaava Boxoffice records : ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించిన చారిత్రాత్మక చిత్రం చావా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అధిగమించి, మొత్తం రూ. 219.75 కోట్ల వసూళ్లను సాధించిందని సాక్నిల్క్ ట్రేడ్ రిపోర్ట్ తెలిపింది.
ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శనతో మొదటి శుక్రవారం నాడు 31 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్స్ తో ప్రారంభమైంది. వారాంతంలో కూడా అదే ఊపును సాధించి, శనివారం నాడు 37 కోట్లు, ఆదివారం నాడు 48.5 కోట్లు వసూలు చేసింది. ఈ ఊపు వారపు రోజులలో కూడా కొనసాగింది, సోమవారం నాడు 24 కోట్లు, మంగళవారం 25.25 కోట్లు, బుధవారం 32 కోట్లు (మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సెలవుదినం కారణంగా పెరిగింది), గురువారం నాడు 22 కోట్లు వసూలు చేసిందని అంచనా.
Chhaava : మహానగరాల్లో రికార్డుల మోత
చావా ముఖ్యంగా ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నైలలో అన్ని వర్గాల దృష్టిని ఆకర్షించింది, ముంబై, పూణేలలో వరుసగా 43.5% మరియు 58.75% ఆక్యుపెన్సీ రేట్లతో దూసుకెళ్తోంది . ఈ చిత్రం విజయంతో విక్కీ కౌశల్ నటించిన రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 244 కోట్లు వసూలు చేసిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ తర్వాత చావా చిత్రం నిలిచింది. ప్రస్తుత వేగంతో, చావా కొన్ని రోజుల్లో ఉరి లైఫ్ టైం రికార్డును అధిగమించే దిశగా పయనిస్తోంది .
సనాతర ధర్మం కోసం శంభాజీ మహరాజ్ చేసిన త్యాగం, ఆయన పడిన కష్టాలను సినిమాలో చూసి ప్రేక్షకులు కన్నీళ్లతో థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. ఈ సినిమా ప్రభావం బాక్సాఫీస్‌ను దాటి విస్తరించింది. మధ్యప్రదేశ్, గోవా తమ రాష్ట్రాల్లో చావాకు పన్ను మినహాయింపు ఉంటుందని ప్రకటించాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గొప్ప వారసత్వాన్ని చూపుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పేర్కొన్నారు.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించి, మాడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించిన చావాలో రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, ఇతరులు నటించారు. ఈ చిత్రం విజయం సాధించడంతో, మరిన్ని రికార్డులను బద్దలు కొట్టి 2025లో డిఫనింగ్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది, రాబోయే వారాల్లో రూ. 250 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.